YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 రెస్ట్ మూడ్ లో తమ్ముళ్లు

 రెస్ట్ మూడ్ లో తమ్ముళ్లు

 రెస్ట్ మూడ్ లో తమ్ముళ్లు
విశాఖపట్టణం, ఫిబ్రవరి 27
చంద్రబాబు ఏడు పదుల వయసులో యాత్రలు అంటున్నారు. బస్తీ మే సవాల్ అంటున్నారు. బస్సెక్కి వస్తాను అంటున్నారు. జిల్లాలను చుట్టేస్తాను, జనాలను పట్టేస్తానని అంటున్నారు. సరే అధినేతకు ఇవన్నీ తప్పని అవసరాలు, అయితే తమ్ముళ్ళు మాత్రం ఎందుకొచ్చిన తంటా ఇదంతా అనుకుంటున్నారుట. నిజానికి ఇపుడు తమ్ముళ్ళు పూర్తిగా రెస్ట్ మోడ్ లో ఉన్నారని అంటున్నారు. ఎందుకొచ్చిన ఈ యాత్రలు అన్న వైరాగ్యం కూడా ప్రదర్శిస్తున్నారుట. కొత్తగా అధికారంలోకి వచ్చిన సర్కార్ కి జనం లో ఇంకా మోజు తగ్గలేదు. ఇంతలోనే రెచ్చిపోయి గోల చేసినా నో యూజ్ అన్నది తమ్ముళ్ళ ఆలోచన‌గా ఉందిట.విశాఖలో చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర ఏర్పాట్ల కోసం చర్చించేందుకు సన్నాహక కమిటీ పేరిట పసుపు పార్టీ నేతలు మీటింగు పెడితే జిల్లాలోని పెద్ద తలకాయలు ఉలుకూ పలుకూ లేదు, ఇక మిగిలిన వారు కూడా ముఖం చాటేశారు. తమ్ముళ్ళు సైతం అధినేత వస్తాడని చెబుతున్నా నీరసంగా స్పందించడం విశేషం. ఓ వైపు జనాలను, మరో వైపు సొమ్మసిల్లిన పార్టీ క్యాడర్ని తట్టి లేపాలని పసుపు పార్టీ పెద్దాయన తెగ తాపయత్రం పడుతూంటే తమ్ముళ్ళు మాత్రం ఎందుకొచ్చిన బాధ ఇదంతా అనుకుంటున్నారుట.యాత్ర పేరు మీద చంద్రబాబు ఊరేగడం వరకూ బాగానే ఉన్నా ఎక్కడికక్కడ డబ్బులు తీసి చేతి చమురు వదిలించుకోవాల్సింది మాత్రం తమ్ముళ్ళే. పైగా గత ఏడాది ఎన్నికల్లో అన్నీ ఖర్చు పెట్టేసి ఫలితం సున్నా అనిపించుకున్నాక మళ్ళీ ఈ అదనపు ఖర్చు ఎందుకు స్వామీ అని తమ్ముళ్ళు వగచి వాపోతున్నారుట. ఎంత చేసినా మరో నాలుగేళ్ళకు పైగా ఇలాగే సాగాలని, ఇపుడే తొందర పడితే ముందు ముందు మరింత మునిగిపోతామని తమ్ముళ్ళు ఆఫ్ ది రికార్డు అంటున్నారుట.మరి ఆదిలోనే ఇలాగైతే ఇక చంద్రబాబు బస్సెక్కి వస్తే విశాఖ తమ్ముళ్ళు రెడీ అవుతారా. చంద్రబాబు వెంట జై అంటూ చప్పట్లు కొడతారా అన్నది పెద్ద డౌటే. బాబు విశాఖను రాజధానిగా వ్యతిరేకించడంతో పాటు, అధికారంలో ఉన్నపుడు పెద్ద నాయకులనే చేరదీసి క్యాడర్ని అసలు పట్టించుకోకపోవడంతో ఇపుడు తమ్ముళ్ళలో చడీ చప్పుడూ లేదని అంటున్నారు. మరో వైపు బడా నాయకులను పదవులు ఇచ్చి పెద్ద కుర్చీలో కూర్చోబెట్టినా వారేమో పక్క చూపులు చూస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు గారు బస్సెక్కి విశాఖ జిల్లా టూరుకి వస్తే ఈలకొట్టెదెవరు, గోల చేసెదెవరో?

Related Posts