YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ

ఘనంగా ప్రారంభమైన యాదాద్రి బ్రహ్మోత్సవాలు

ఘనంగా ప్రారంభమైన యాదాద్రి బ్రహ్మోత్సవాలు

ఘనంగా ప్రారంభమైన యాదాద్రి బ్రహ్మోత్సవాలు
నల్గొండ, ఫిబ్రవరి 27
తెలంగాణకు తలమానికంగా విరజిల్లుతూ విశ్వ క్షేత్రంగా రూపుదిద్దుకుం టున్న యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.యాదగిరిశుని బ్రహోత్సవాలు వచ్చే నెల 7వ తేదీ వరకూ అత్యంత వైభవంగా జరగనున్నాయి. బ్రహోత్సవాల నిర్వహణపై ఈవో గీతారెడ్డి పలు దఫాలుగా సమీక్షలు జరిపారు. ఆలయ విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో బాలాలయంలోనే శ్రీవారి ఉత్సవ కెంకర్యాలు నిర్వహించనున్నారు. భక్తుల కోసం కొండ కింద బస్టాండ్‌ ఎదురుగా ఉన్న మైదానంలో రాత్రివేళ జరిగే వేడుకలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయనున్నారు. ఇక్కడే వేలాది మంది భక్తులు శ్రీవారి బ్రహోత్సవ కల్యాణం వీక్షించటానికి ఏర్పాట్లల్లో అధికారులు నిమగమయ్యారు.ఈ నెల 3న ఎదుర్కొళ్లోత్సవం కొండపైన జరగనుండగా 4న జరుగు తిరుకల్యాణ మహోత్సవం, 5న దివ్యవిమాన రథోత్సవం జరుగనుంది. తిరుకల్యాణోత్సవానికి గవర్నర్‌ తమిళసై సౌందర్‌ రాజన్‌తో పాటు ఆధ్యాత్మిక గురువు చిన్నజీయర్‌ హాజరు కానున్నారు. సీఎం కేసీఆర్‌ శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారు. గవర్నర్‌, సీఎం, చిన్నజీయర్‌ తిరుకల్యాణ మహోత్సవానికి విచ్చేస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు అదే స్థాయిలో కొండకింద బస్టాండ్‌ ఎదురుగా మైదానంలో చేపట్టనున్నారు.ఈ నెల 28న అలంకార సేవలు మొదలవుతాయి. మొదటి రోజు ఉదయం మత్య్సవతార అలంకార సేవ, వేద పారాయణాలు, రాత్రి శేష వాహన సేవ, 29న ఉదయం శ్రీకృష్ణ అలంకార (మురళికృష్ణ) సేవ, రాత్రి హంసవాహన సేవ, 1న ఉదయం వటపత్రసాయి అలంకార సేవ, రాత్రి పొన్నవాహన సేవ, 2న ఉదయం గోవర్ధన గిరిధారి అలంకార సేవ, రాత్రి సింహావాహన సేవ, 3న ఉదయం జగన్మోహిని అలంకార సేవ, రాత్రి ఆశ్వవాహన సేవ, బాలాయలంలో ఎదుర్కొళ్లోత్సవం, 4న ఉదయం శ్రీరామాలంకారం (హనుమంత సేవ) 11నుంచి గజవాహన సేవ, అదే ఉదయం బాలాలయంలో తిరుకల్యాణోత్సవం, రాత్రి కొండకింద ఓల్డ్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌లో కల్యాణ వేడుకలు, 5న ఉదయం మహావిష్ణు అలంకార, గరుఢ వాహన సేవ, రాత్రి బాలాలయంలో దివ్యవిమాన రథోత్సవం, అదే రోజు రాత్రి కొండకింద వైకుంఠ ద్వారం నుంచి దేవస్థాన ప్రచారం రథం ఊరేగింపు, 6న ఉదయం మహాపూర్ణాహుతి, చక్రతీర్థం, సాయంత్రం శ్రీ పుష్పయాగం, దేవతోద్వాసన, దోపోత్సవం, 7న ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి

Related Posts