YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు విదేశీయం

19 ఏళ్ల కెరీర్ కు షరపోవా గుడ్ బై

19 ఏళ్ల కెరీర్ కు షరపోవా గుడ్ బై

19 ఏళ్ల కెరీర్ కు షరపోవా గుడ్ బై
మాస్కో, ఫిబ్రవరి 27,
రష్యాకు చెందిన టెన్నిస్ స్టార్ మ‌రియా ష‌ర‌పోవా తాజాగా టెన్నిస్ కు గుడ్ బై చెప్పింది. గత కొంత కాలంగా నిషేధం తో పాటు గాయాలతో సతమతమవుతున్న మరియా షరపోవా ఆటకు రిటైర్మెంట్‌ను బుధవారం ప్రకటించింది. ఆటకు వీడ్కోలు ప్రకటించేందుకు ఇదే సరైన సమయమని పేర్కొంది. 2004లో వింబుల్డన్ మహిళల సింగిల్స్ టోర్నీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. 17 ఏళ్ల ప్రాయంలో దిగ్గజం అమెరికాకు చెందిన సెరెనా విలియమ్స్ ను ఓడించి పతాక శీర్షికలకెక్కింది. 2001లో ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ గా మారిన షరపోవా 19 ఏళ్ల పాటు తన కెరీర్ ను కొనసాగించింది.ఆమె తన కెరీర్లో ఐదు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలను సాధించింది. గతంలో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు సాధించిన షరపోవా.. ప్రస్తుతం 373వ ర్యాంకులో కొనసాగుతోంది. 2016 ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత డ్రగ్ టెస్టులో విఫ‌లమై 15 నెలలపాటు నిషేధానికి గురైంది. అనంతరం గాయాలు, ఫామ్ లేమితో అంతంత మాత్రం ప్రదర్శన చేసింది. ఇక 2012వ సంవత్సరం షరపోవా కెరీర్లో మరపురానిది గా నిలిచింది. ఆ సంవత్సరమే ఫ్రెంచ్ ఓపెన్ గెలుపొందిన షరపోవా.. కెరీర్ స్లామ్ సాధించిన ప‌దో మహిళా టెన్నిస్ ప్లేయర్ గా నిలిచింది. అలాగే అదే ఏడాది జరిగిన లండన్ ఒలింపిక్స్‌లో మహిళ సింగిల్స్ లో రజత పతకం సాధించింది.టెన్నిస్ తనకెంతో ఇచ్చిందని, ఇకమీదట ఆటను ఎంతగానో మిస్ అవుతానని రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా షరపోవా వ్యాఖ్యానించింది. టెన్నిస్ ప్ర‌యాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నాన‌ని పేర్కొంది. ఒకసారి శిఖరంపైకి చేరాక అక్కడినుంచి ప్రపంచమంతా అద్భుతంగా కనిపించిందని ఈ సందర్భంగా షరపోవా భావోద్వేగభ‌రితంగా వ్యాఖ్యానించింది.

Related Posts