YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 కుత్బుల్లాపూర్ లో పట్నం గోస కార్యక్రమం

 కుత్బుల్లాపూర్ లో పట్నం గోస కార్యక్రమం

 కుత్బుల్లాపూర్ లో పట్నం గోస కార్యక్రమం
హైదరాబాద్  ఫిబ్రవరి 27
తనపై ఎన్నికేసులు పెట్టినా తాను వెనుకంజ వేయబోనని, ప్రభుత్వం పై పోరాటానికి సిద్దపడినప్పుడల్లా తనపై ఎదో ఒక ఆరోపణ కేసులు పెట్టడం ప్రభుత్వానికి అలవాటే నని, తానుమాత్రం ప్రభుత్వ వైఫల్యాలపై తన పోరాటం కొనసాగుతుందని మల్కాజ్‌గిరి ఎమ్.పి రేవంత్ రెడ్డి అన్నారు. పట్నం గోస" కార్యక్రమం లో భాగంగా  కుత్బుల్లాపూర్‌ మాజీ ఎమ్.ఎల్.ఏ కూన శ్రీశైలం గౌడ్ ఆద్వర్యంలో.. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని అసంపూర్తిగా ఉన్న రాజీవ్ స్వగృహ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను సందర్శించిన  మల్కాజ్‌గిరి ఎమ్.పి రేవంత్ రెడ్డి. అసంపూర్తిగా ఉన్న రాజీవ్ స్వగృహ బిల్డింగ్ లపనులను చూచి అధికారులను ఫోన్ ద్వారా నిర్మాణ పనులు ఎందుకు జరుగడం లేదు అని ఆడిగి  తెలుసుకున్నారు. 5వేల రూపాయలు కట్టి బుక్ చేసుకున్న అప్పటి లబ్ధిదారులు తమ వద్ద ఉన్న రషీదును చూపించి, తాము 5వేలు కట్టి సుమారు 13సంవత్సరాలు కావస్తున్నా ప్రభుత్వం ఇప్పటివరకు తమకు ఇల్లు కేటాయింపు జరుగలేదని ఎంపి రేవంత్ రెడ్డికి తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ‌ ఆగిపోయి ఉన్న పనులను వెంటనే పూర్తి చేసి లబ్దిదారులకు కేటాయించాలని డిమాండ్ చేసారు. గోపన్ పల్లి భూ అక్రమాల ఆరోపణలపై ఘాటుగా స్పందించిన రేవంత్ రెడ్డి, తాను ప్రభుత్వంపై వ్యతిరేక పోరాటానికి బయలుదేరినప్పుడల్లా  అక్రమ ఆరోపణల కేసులు పెట్టడం సహజమని, ఎన్ని కేసులు  పెడితే అంత తనకే లాభం అని, కేసులు తనకు ప్రభుత్వం ఇచ్చే పట్టా లాంటివని అన్నారు. పనులు పూర్తి చేయక పోతే  ఉద్యోగులను డిస్మిస్ చేస్తానన్న కేసిఆర్, కేటిఆర్ లు డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణ పనులు పూర్తి చేయకుండా వైఫల్యం చెందిన వీరు వెంటనే తమ ఉద్యోగాలకు రాజీనామా చేయాలని  డిమాండ్ చేసారు. పనులు పూర్తి చేయని కంట్రాక్టర్లు బిళ్ళులను ఆపాలని, వారివద్ద పెనాలటీలను వసూలు చేయాలని కోరారు.

Related Posts