గోపనపల్లి భూములపై విచారణకు సిద్దం
హైద్రాబాద్, ఫిబ్రవరి 27
గోపన్‌పల్లి భూముల విషయంలో రేవంత్ రెడ్డిపై వస్తున్న ఆరోపనలు నేపథ్యంలో ఆయన స్పందించారు. ప్రజా క్షేత్రంలో ఉన్నప్పుడు ఎవరికైనా ఇలాంటి సమస్యలు రావడం సహజమేనని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నప్పుడు ప్రభుత్వం తప్పుడు కేసులతో వేధించడం ఇదేం కొత్త కాదని వ్యాఖ్యానించారు. తనపై ఎన్ని కేసులు పెడితే, తనకు అంత లాభమని చెప్పారు. సరిగ్గా పని చేయకపోతే ఉద్యోగులను తీసేసినట్లుగానే, హామీలు నెరవేర్చని కేసీఆర్, కేటీఆర్ వంటి వారు కూడా రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.గోపన్ పల్లి భూముల వ్యహారంలో కొత్త మలుపులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. 2016లో నమోదైన కేసులో రేవంత్ రెడ్డిపై గచ్చిబౌలి పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ ల్యాండ్ కేసులో రేవంత్ రెడ్డి ప్రమేయం ఉందని తేల్చిన పోలీసులు ఆయనతో పాటు పాటు సోదరుడు కొండల్ రెడ్డి, లక్ష్యయ్య పేర్లను కూడా చార్జిషీట్‌లో చేర్చారు. సర్వే నెంబర్ 127కు సంబంధించిన ల్యాండ్ కేసులో రేవంత్‌పై కొన్ని ఆభియోగాలు నమోదు చేశారు. అయితే, ఈ ల్యాండ్ కు సంబంధించి ఇప్పటికీ తామే నిజమైన ఓనర్లమని కొందరు వ్యక్తులు ముందుకు వచ్చారు.గోపన్ పల్లిలోని సర్వే నెంబరు 127లో కట్టడాలను రేవంత్ రెడ్డి దౌర్జన్యంగా కూల్చివేశారంటూ బాధితులు ఫిర్యాదు చేశారు. అక్కడ ఉన్న గదిని రేవంత్‌తో పాటు ఆయన అనుచరులు కూల్చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు