YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

 రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్.. 

 రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్.. 

 రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్.. 
న్యూఢిల్లీ ఫిబ్రవరి 27
ఢిల్లీ హింసాత్మక ఘటనపై జోక్యం చేసుకోవాలని కోరుతూ సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధుల బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను గురువారం కలిసింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హింసను నిరోధించడంతో కేంద్రం విఫలమైందని, ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రేక్షక పాత్ర పోషించారని విమర్శించారు. పౌరుల జీవనం, స్వేచ్ఛ, ఆస్తులు సంరక్షించబడాలని రాష్ట్రపతిని కలిశామని... హింసను నియంత్రించలేకపోయిన కేంద్ర హోంమంత్రిని తక్షణమే తొలగించాలని మరోసారి పునరుద్ఘాటించారు. రాజ ధర్మాన్ని కేంద్రం పాటించాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కోరారు. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, గులామ్ నబీ ఆజాద్ సహా సీనియర్ నేతలు రాష్ట్రపతి నిలయానికి వెళ్లి రాష్ట్రపతిని కలిసి, వినతి పత్రం సమర్పించారు.పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా, వ్యతిరేకంగా ఈశాన్య ఢిల్లీలో జఫ్రాబాద్, చాంద్‌బాగ్, మౌజిపూర్, బజన్‌పుర, కర్దామ్‌పురి, గోకుల్‌పురి, ఖజౌరి, కర్వాల్ నగర్ ప్రాంతాల్లో ఫిబ్రవరి 23న మొదలైన ఆందోళనలు క్రమంగా హింసకు దారితీశాయి. ఈ ఘర్షణల్లో ఇరు వర్గాలు పరస్పర దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో ఓ కానిస్టేబుల్ సహా 34 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. హింసాత్మక ఘటనలపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో 1984 నాటి పరిస్థితి పునరావృతమయ్యేలా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది.గురువారం నాటి హైకోర్టు విచారణకు ఢిల్లీ పోలీసుల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు. ఈశాన్య ఢిల్లీలో సాధారణ పరిస్థితి నెలకునే వరకూ తొందరపడి జోక్యం చేసుకోవద్దని సూచించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదుచేయలేదని, దీని వల్ల శాంతికి, సాధారణ పరిస్థితి నెలకోడానికి ఎలాంటి ఉపయోగం ఉండదని పోలీసులు హైకోర్టుకు తెలియజేశారు.ఢిల్లీలో హింసపై నిఘా వర్గాలు ముందగానే హెచ్చరించినా పోలీసులు సరిగ్గా స్పందించలేదనే ప్రచారం సాగుతోంది. ఐబీ అధికారి అంకిత్ శర్మ మృతివెనుక ఆప్ కౌన్సెలర్‌ తాహిర్ హుస్సేన్ హస్తం ఉందనే ఆరోపణలను ఆయన ఖండించారు. అంకిత్ హత్యకు తాహిర్ కుటుంబం కుట్రకోణం ఉందంటూ మీడియాలో వస్తున్న ప్రచారంపై ఆయన స్పందించారు. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు.. కుటుంబం సహా నా రక్షణ కోసం పోలీసుల సమక్షంలో ఇంటి నుంచి సోమవారం వేరేచోటికి వెళ్లిపోయినట్టు పేర్కొన్నారు

Related Posts