YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం

ఫాస్ట్ ఫుడ్స్ లో తగ్గుతున్న స్పెర్మ్ కౌంట్

ఫాస్ట్ ఫుడ్స్ లో తగ్గుతున్న స్పెర్మ్ కౌంట్

ఫాస్ట్ ఫుడ్స్ లో తగ్గుతున్న స్పెర్మ్ కౌంట్
2,935 మంది పురుషులపై అధ్యయనం
న్యూయార్క్, ఫిబ్రవరి 28
జీ లైఫ్‌.. అందుకోలేని టార్గెట్లు.. కనీసం తిండి తినడానికి కూడా సమయం కేటాయించలేని పరిస్థితి. దీంతో దొరికిందే పది వేలు అన్నట్లుగా ఫాస్ట్ ఫుడ్‌తో కడుపు నింపేసుకుంటున్నారు. దీని  వల్ల వారి శరీరానికి జరుగుతున్న నష్టాన్ని అంచనా వేయలేకపోతున్నారు. ఫలితంగా అనారోగ్యాలే కాదు.. సంతాన సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి పురుషుడు  తెలుసుకోవలిసిన కొన్ని కీలక విషయాలను ఇక్కడ అందిస్తున్నాం. తాజా సర్వేలో వెల్లడైన ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకోకుండా ఆరోగ్యంపై శ్రద్ధ చూపితే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది.  ఇంతకీ ఆ స్టడీ ఏమిటీ? అందులో తేలిన అంశాలేమిటనేది ఇప్పుడు చూద్దాం.ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినేవారిలో సంతాన సమస్యలు తలెత్తుతున్నట్లు సర్వేలో తేలింది. ఏదైతే ఆహారం తమ  కడుపును సులభంగా నింపుతుందని భావిస్తున్నారో.. అదే ఆహారం వారి పురుషత్వాన్ని సన్నగిల్లేలా చేస్తోందని, ముఖ్యంగా స్మెర్మ్ కౌంట్‌ను, వృషణాల పరిమాణాన్ని తగ్గిస్తోందని తెలిసింది.  హార్వర్డ్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో డాక్టర్ ఫీబీ నాసన్ నేతృత్వంలో నిర్వహించిన ఈ స్టడీలో ఎన్నో కీలకమైన విషయాలు వెల్లడయ్యాయి.జమా నెట్‌వర్క్’లో ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకారం.. అతిగా జంక్ ఫుడ్ (చిల్లర తిండ్లు) తినే పురుషుల వృషణాల పరిమాణం చిన్నగా ఉన్నట్లు తేలింది. పురుషులు తినే ఆహారం  ఆధారంగా ఈ మార్పు కనిపించినట్లు పేర్కొంది. అయితే, ఆ ఆహారం ఏమిటనేది తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. మీరు ఎంతో ఇష్టంగా.. ప్రాణంగా భావించే మీ ఫెవరెట్ ఫుడ్ కూడా  ఇందులో ఉండవచ్చు. అవేంటో చూసేయండి మరి.రెడ్ మీట్, బ్రెడ్, తీపి పదార్థాలు తినే అలవాటు ఉంటే ఇప్పుడే మానేసుకోండి. ఎందుకంటే ఇవి మీ స్పెర్మ్ కౌంట్‌ను తగ్గించే అవకాశం ఉంది.   అలాగే, పిజ్జా, బర్గర్, చిప్స్ ఎక్కువగా తినే వ్యక్తుల్లో ఉండే స్పెర్మ్ కౌంట్.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినే వ్యక్తుల కంటే 26 మిలియన్ తక్కువగా ఉన్నట్లు లెక్కించారు. జంక్ ఫుడ్ వల్ల  స్పెర్మ్‌ను ఉత్పత్తి చేసే కణాలు చనిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.అధ్యయనంలో భాగంగా నిపుణులు మిలటరీ సర్వీస్ ఎంట్రన్స్ పరీక్షల్లో పాల్గొన్న 2,935 మంది యువకులపై ఈ  పరీక్షలు నిర్వహించింది. వీరి సరాసరి వయస్సు 19 ఏళ్లు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి వృషణాల సైజు, వారు తీసుకునే ఆహారం తదితర వివరాలను తెలుసుకున్నారు. వారి నుంచి సేకరించిన స్పెర్మ్‌ను సైతం పరిశీలించినట్లు యూకేకు చెందిన ‘సన్’ వార్త సంస్థ వెల్లడించింది. వాటి సైజు, ఈత సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం వారి ఆహారపు అలవాట్ల ప్రకారం ప్రత్యేక జాబితాను రూపొందించారు.చేప, చికెన్, పండ్లు, కూరగాయలు, నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినేవారి వృషణాలు పెద్ద సైజులో ఉన్నట్లు స్టడీలో తెలిసింది. ప్రోసెసింగ్ ఫుడ్,  రెడ్ మీట్, జంక్ ఫుడ్‌లను తినేవారిలో వృషణాల సైజు తక్కువగా ఉన్నట్లు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో తండ్రి కావాలనుకునే పెద్దలు తప్పకుండా సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలని  స్టడీ వెల్లడించింది. జంక్ ఫుడ్‌కు వీలైనంత దూరంగా ఉండాలని సూచించింది.వృషణాల పరిమాణం 13.7 ఎంఎల్ ఉన్న వ్యక్తుల్లో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకొనే వ్యక్తుల విషయాన్ని  పరిశీలిస్తే.. 13.7 ఎం.ఎల్. సైజు గల వృషణాల్లో 167 మిలియన్ స్పెర్మ్ ఉన్నట్లు గుర్తించారు. జంక్ ఫుడ్ తినే వ్యక్తుల వృషణాల సైజు 13.1 ఎం.ఎల్. ఉందని, వాటిలో కేవలం  122 మిలియన్ స్పెర్మ్ ఉన్నట్లు స్టడీలో పేర్కొన్నారు. పిజ్జా, చిప్స్, రెడ్ మీట్ వల్ల యాంటీ ఆక్సిడెంట్ స్ట్రెస్ స్థాయిలు పెరుగుతాయని, ఇది స్పెర్మ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని  స్పష్టం చేశారు. చూశారుగా.. ఇకపై ఆహారాన్ని తినేప్పుడు తప్పకుండా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే.. ఇటీవల సంతాన లేమి సమస్యలు ఇండియాలో కూడా ఎక్కువయ్యాయి.  స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ మంది ఐవీఆర్ విధానంపై ఆధారపడుతున్నారు. సంతానం కోసం లక్షలు వెచ్చిస్తున్నారు. 

Related Posts