* ఏపీలో 400, తెలంగాణలో 255 ఖాళీలు
హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) 8వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రకటించింది. జూనియర్ అసోసియేట్స్(కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) విభాగంలోని పోస్టుల భర్తీకి ఈ ప్రకటన విడుదల చేసింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో 400, తెలంగాణలో 255 ఖాళీలు ఉన్నాయి. ఎస్‌బీఐ ఆన్‌లైన్‌లో నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో చూపిన ప్రతిభ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. విద్యార్హత కింద ఏదైనా డిగ్రీ ఉండాలి.
అభ్యర్థులకు జనవరి 1, 2018 నాటికి 20-28ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపుల వర్తిస్తాయి. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు పరీక్షల్లో మైనస్ మార్కులు ఉంటాయి. ప్రతీ తప్పునకు పావుశాతం చొప్పున మార్కుల కోత ఉంటుంది. జనవరి 20 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులకు ఫిబ్రవరి 10తో గడువు ముగుస్తుంది. ప్రిలిమినరీ పరీక్షలు మార్చి/ఏప్రిల్‌లో నిర్వహిస్తారు. మెయిన్స్ మే 12న నిర్వహించడం జరుగుతుంది.
ఆన్‌లైన్‌లో ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాలు:
ఏపీలో చీరాల, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
* తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్
ఎన్‌బీఐలో 8301 జూనియర్ అసోసియేట్ పోస్టులు
* ఏపీలో 400, తెలంగాణలో 255 ఖాళీలు
ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ 8301 జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది.
(నిషేధిత వెబ్ సైట్లును నియంత్రణ కోసం...
ఈ బ్రౌజర్ డౌన్లోడ్ చేసుకొని .. బ్రౌజింగ్ మొదలు పెట్టండి.
వైరస్ రాకుండా ఉండటమే కాకుండా.. నిషేధిత వెబ్ సైట్లు ఈ బ్రౌజర్ లో ఓపెన్ కావు.
పాయింట్ల ప్రాతిపదికన ఎక్కువగా బ్రౌజ్ చేసే వారికి ఇతర లాభాలున్నాయి.
ఆన్‌లైన్‌లో నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో చూపిన ప్రతిభ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
అర్హత: ఏదైనా డిగ్రీ
వయఃపరిమితి: జనవరి 1, 2018 నాటికి 20 -28 ఏళ్లలోపు ఉండాలి. అంటే జనవరి 2, 1990 కంటే ముందు; జనవరి 1, 1998 తర్వాత జన్మించినవాళ్లు అనర్హులు. (ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయఃపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి)
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌లో నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్స్‌ల ద్వారా
ప్రిలిమినరీ పరీక్షలో: ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 30, న్యూమరికల్ ఎబిలిటీ 35, రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. మొత్తం ప్రశ్నపత్రం వంద మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి ఒక గంట. ప్రతి సెక్షన్‌కు వ్యవధి 20 నిమిషాలు.
మెయిన్స్ ఇలా: ఇందులో 4 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్-1లో జనరల్ / ఫైనాన్షియల్ అవేర్‌నెస్ నుంచి 50 ప్రశ్నలు వస్తాయి. వీటిని 35 నిమిషాల్లో పూర్తిచేయాలి. సెక్షన్ -2 జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు, 35 నిమిషాలు, సెక్షన్-3 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 50 ప్రశ్నలు వీటికి 45 నిమిషాలు, సెక్షన్ -4 రీజనింగ్ అబిలిటీ, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు వస్తాయి. వ్యవధి 45 నిమిషాలు. వీటికి 60 మార్కులు. మిగిలిన అన్ని సెక్షన్లకు ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. మొత్తం 190 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి 2 గంటల 40 నిమిషాలు.
ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు పరీక్షల్లోనూ రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికీ పావుశాతం చొప్పున మార్కులు తగ్గిస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు పరీక్షల్లోనూ సెక్షన్లవారీ కటాఫ్ మార్కులు ఉంటాయి. అలాగే పేపర్ మొత్తానికి కూడా కటాఫ్ మార్కులు ఉంటాయి. వీటిని ఎస్‌బీఐ నిర్ణయిస్తుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి ఆయా విభాగాలవారీ మొత్తం ఖాళీలకు పది రెట్ల సంఖ్యలో అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపికచేస్తారు. ప్రిలిమినరీ అర్హత పరీక్ష మాత్రమే. మెయిన్స్‌లో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్థులు ఏ సర్కిల్ పోస్టులకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఆ సర్కిల్‌కు కేటాయించిన ఏదో ఒక స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాగలగడం తప్పనిసరి.
దరఖాస్తులు: జనవరి 20 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.వంద; జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 10
ప్రిలిమినరీ పరీక్షలు: మార్చి/ ఏప్రిల్‌లో నిర్వహిస్తారు.
మెయిన్స్ పరీక్ష: మే 12న
ఆన్‌లైన్ ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాలు: ఏపీలో చీరాల, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
పే స్కేల్: 11765-31450. మెట్రో నగరాల్లో ఉద్యోగం పొందినవారు సుమారు రూ.23,600 వేతన రూపంలో పొందవచ్చు. వెబ్‌సైట్: www.sbi.co.in/careers