YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 డమ్మీలుగా మారిపోయిన రాజ్యసభ సభ్యులు

 డమ్మీలుగా మారిపోయిన రాజ్యసభ సభ్యులు

 డమ్మీలుగా మారిపోయిన రాజ్యసభ సభ్యులు
విజయవాడ, ఫిబ్రవరి 28
ఆ ముగ్గురు రాజ్యసభలు ఇప్పుడు డమ్మీలుగా మారిపోయారు. వారు వస్తే బలం మరింత పెరుగుతుందని భావించిన భారతీయ జనతా పార్టీకీ అసలు విషయం తెలిసిపోయినట్లుంది. అందుకే వారిని దూరంగా ఉంచాలని నిర్ణయించినట్లు కనపడుతోంది. అందుకే వీరికి ఇప్పుడు పార్టీలోనూ ప్రయారిటీ లేకుండా చేశారు. అయినా తమ పాత కేసులు బయటకు వస్తాయని ఇందులో కొందరు మాత్రం పార్టీనే అంటిపెట్టుకుని ఉండాలని డిసైడ్ అయ్యారు.ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్ లు బీజేపీలో చేరిపోయారు. వీరితో పాటు చేరిన తెలంగాణకు చెందిన గరికపాటి మోహనరావు పదవీ కాలం పూర్తయింది. అయితే ఈ ముగ్గురిలో సుజనా చౌదరికి బ్యాంకు కేసులున్నాయి. సీఎం రమేష్ పై గతంలో ఐటీ దాడులు జరిగాయి. టీజీ వెంకటేశ్ మాత్రం పారిశ్రామికవేత్తగానే ఉన్నారు. ఈ ముగ్గురు చేరడం వల్ల రాజ్యసభలో తమ బలం పెరుగుతుందని భావించి మాత్రమే బీజేపీ వారికి కండువా కప్పేసింది.అయితే వీరు పార్టీలో చేరినప్పటి నుంచి ఏపీలో తలనొప్పులు తయారయ్యాయి. ఏపీ రాజధాని అంశంలో ప్రధానంగా సుజనా చౌదరి జోక్యం మితిమీరిపోయిందని పార్టీ భావించింది. అదే పార్టీకి చెందిన జీవీఎల్ నరసింహారావు సుజనా వ్యాఖ్యలను బహిరంగంగానే ఖండించారు. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఉండబోదని కూడా ఆయన చెప్పిన తర్వాత కూడా సుజనా చౌదరి ఎక్కడా తగ్గలేదు. సీఎం రమేష్ మాత్రం ఈ విషయంంలో పెద్దగా స్పందించలేదు. ఇక టీజీ వెంకటేష్ రాష్ట్ర పార్టీ లైన్ ను థిక్కరిస్తూ స్టేట్ మెంట్ ఇచ్చారు.ఇలా టీడీపీ నుంచి వచ్చిన వీరు ముగ్గురూ పార్టీకి భారంగా మారారే తప్ప పెద్దగా ఉపయోగం లేదని బీజేపీ పెద్దలకు అర్థమవ్వడానికి ఎనిమిది నెలలకు మించి పట్టలేదు. ప్రత్యక్ష్య రాజకీయాల్లో వెంకటేశ్ తప్పించి మిగిలిన ఇద్దరికీ పట్టులేదని, క్యాడర్ కూడా పెద్దగా లేదని భావించిన బీజేపీ వీరిని దూరంగా పెడుతోంది. సమావేశాలకు ఆహ్వానించడం లేదు. ముఖ్య నిర్ణయాల్లో వీరి ప్రమేయాన్ని బీజేపీ కోరుకోవడం లేదు. దీంతో వీరిని డమ్మీలుగా మార్చేశారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. దీంతో ఇటీవల కాలంలో వీరు సైలెంట్ గా ఉంటున్నారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను టీజీ వెంకటేష్ కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అబ్బే అదేమీ లేదంటూ టీజీ చిరునవ్వులు చిందిస్తున్నా ఊరికే కలవరు మహానుభావులు అన్న వ్యాఖ్యలయితే బలంగా విన్పిస్తున్నాయి

Related Posts