YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ

మార్చి 25 నుంచి రామయ్య బ్రహ్మోత్సవాలు

మార్చి 25 నుంచి రామయ్య బ్రహ్మోత్సవాలు

మార్చి 25 నుంచి రామయ్య బ్రహ్మోత్సవాలు
ఖమ్మం, ఫిబ్రవరి 28
శ్రీరామనవమి బ్ర హ్మోత్సవాలకు  జిల్లా అధికార యంత్రాంగం న డుంబిగించింది. కలెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంవీ రెడ్డి ఉత్సవాల విజయవంతానికి మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తున్నారు.గతంలో కీసర మహోత్సవాలను విజయవంతం చేసిన అనుభవం ఉన్న కలెక్టర్‌ భద్రాద్రిలో నిర్వహించే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను కూడా అంగరంగవైభవంగా నిర్వహించాలని భావిస్తున్నారు. ప్రధానమైన కమిటీలను ఏర్పాటు చేసి వాటి కమిటీల ద్వారా ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తుల రాకకు అనుగుణంగా సౌకర్యాలు పెంచే విషయంపై కసరత్తు చేస్తున్నారు. ఆరోగ్యం, రవాణా, ట్రాఫిక్‌, లడ్డూ ప్రసాదాలు, సాంస్కృతిక, ప్రచార విభాగం, ప్రోటోకాల్‌, పారిశుధ్యం తదితర కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిటీలలో  అధికారులతో పాటు స్థానికంగా ఉన్న ప్రముఖుల సహాయ సహకారాలను తీసుకోనున్నారు. పట్టణంలో ప్రధాన ప్రాంతాల్లో రామాయణ ఇతిహాసాలను భక్తులకు కళ్లకు కట్టేలా చూపించే  విధంగా బొమ్మలను కూడా వేపించాలని కలెక్టర్‌ భావిస్తున్నారు.  మార్చి25 నుంచి ఏప్రిల్‌8వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఏప్రిల్‌2న శ్రీసీతారాముల కల్యాణం,  ఏప్రిల్‌3న శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది. గతంలో మాదిరి కాకుండా ఈ సారి బ్రహ్మోత్సవాలకు ముందురోజే ఏర్పాట్లన్ని పూర్తికావాలని జిల్లా కలెక్టర్‌ స్థానిక అధికారులను ఆదేశించడంతో ఆ  దిశగా అధికారులు చర్యలకు శ్రీకారం చుడుతున్నారు. రూ.85 లక్షల అంచనా వ్యయంతో 33 తాత్కాలిక పనులను చేపట్టేందుకు ఈ ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా టెండర్ల ప్రక్రియను చేపట్టారు. 33 పనులను చేపట్టేందుకు దేవస్థానం నిర్ణయించింది. బుధవారం రంగులు వేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. తడికెల పందిరి, గ్రీన్‌ మ్యాట్‌, సీసీ కెమేరాలు ఏర్పాటుకు  సంబంధించి టెండర్‌ ప్రక్రియలో ఎవ్వరు పాల్గొనలేదు. దీంతో మరోసారి టెండర్లు పిలవాలని దేవస్థానం అధికారులు భావిస్తున్నారు. రూ.85 లక్షల అంచనా వ్యయంతో వివిధ తాత్కాలిక పనులను చేపట్టేందుకు దేవస్థానం ప్రయత్నిస్తుండగా మొత్తం మీద ఈ బ్రహ్మోత్సవాలకు దేవస్థానం రూ.కోటిన్నరకు పైగానే ఖర్చు చేయనుంది. కళ్యాణం నిర్వహించే మిథిలా ప్రాంగణంలో 20 వేల మందికి పైగా భక్తులు కల్యాణం వీక్షించే అవకాశం ఉంది. దీంతో ఈ ప్రాంగణాన్ని 24 సెక్టార్లుగా విభజించనున్నారు. కల్యాణాన్ని వీక్షించే భక్తులకోసం మార్చి1 నుంచి ఆన్‌లైన్‌లో కళ్యాణ, శ్రీరామపట్టాభిషేక టిక్కెట్లు అందుబాటులోకి రానున్నాయి. రూ.5వేలు, రూ.2 వేలు, రూ.1000, రూ.500, రూ.200, రూ.100 టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ఉంచనున్నారు. దేవస్థానం నేరుగా కూడా ప్రత్యేక కౌంటర్ల ద్వారా టిక్కెట్లను విక్రయించనుంది. కళ్యాణ ప్రాంగణంలో ఈ సారి గతం కంటే 60కూలర్లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Related Posts