Highlights
ఏప్రిల్ 2న బ్యాంకు లకు సెలవు
ఈ రోజు రాత్రి 8 గంటల వరకు బ్యాంకులు పనిచేస్తాయని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) వెల్లడించింది. పన్ను చెల్లింపుదారుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. బ్యాంకులతో పాటు ఆర్‌బీఐ అన్ని శాఖల కార్యాలయాలు కూడా రేపు రాత్రి 8 గంటల వరకూ తెరిచే ఉంటాయని పేర్కొంది. అంతేగాక.. శనివారం అర్ధరాత్రి వరకు డిజిటల్ లావాదేవీలు చేసుకోవచ్చని తెలిపింది. రేపటితో ఈ 2017-18 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. అంతేగాక ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు రేపే ఆఖరి తేదీ కావడంతో బ్యాంకుల సమయాన్ని పెంచినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. ఇక ఆర్‌టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీ వంటి ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ సేవలు శనివారం అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. కాగా.. ఏప్రిల్ 2న బ్యాంకులకు సెలవు దినం అని స్పష్టం చేసింది.