YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

మరో 56 వేల టన్నుల కందుల కొనుగోలుకు అనుమతివ్వండి

మరో 56 వేల టన్నుల కందుల కొనుగోలుకు అనుమతివ్వండి

మరో 56 వేల టన్నుల కందుల కొనుగోలుకు అనుమతివ్వండి
హైదరాబాద్  ఫిబ్రవరి 28 
అదనంగా 56 వేల మెట్రిక్ టన్నుల కందుల కొనుగోలుకు అనుమతివ్వాలని కేంద్రానికి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి లేఖ రాసారు.  గతంలో మంజూరుచేసిన 47,500 టన్నులు , తాజాగా ఇచ్చిన 4500 టన్నులు ఏ మూలకూ సరిపోవు.  తెలంగాణలో ఈ ఏడాది 2 లక్షల మెట్రిక్ టన్నుల పై చిలుకు దిగుబడి వచ్చింది.  మరో 56 వేల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు అనుమతివ్వాలని గత నెలలో కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం తరపున రాసిన లేఖలో అయన పేర్కోన్నారు.  గురువారం ఢిల్లీ ఐకార్ సమావేశంలో మరోమారు  ప్రస్తావించి కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్రసింగ్ తోమర్   దృష్టికి తీసుకెళ్లారు.  కందుల కోటా కేటాయింపుకు మరోమారు లేఖ పంపాలని కేంద్రం  సూచించింది.  కేంద్రం సూచన మేరకు  శుక్రవారం 56 వేల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు అనుమతివ్వాలని మంత్రి  మరోమారు లేఖ రాసారు.  సాగునీటి రాకతో తెలంగాణలో గత ఏడాదికన్నా 40.8 శాతం  వివిధ రకాల పంటల  సాగు పెరిగింది.  దాదాపు 130 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతాయని అంచనా వేసాం.  రాష్ట్రంలో పంటల దిగుబడికి .. కేంద్రం కనీస మద్దతుధరకు కొనుగోలు  చేసేందుకు అనుమతిస్తున్న కోటాకు భారీ వ్యత్యాసం వుంది.  పండిన పంటలో 20 నుండి 25 శాతం కొనుగోలుకే మద్దతుధర వుంటుంది.  సొంతంగా మద్దతుధర చెల్లిస్తూ తెలంగాణ ప్రభుత్వం  కొంటుందని మంత్రి పెర్కోన్నారు.  కనీస మద్దతుధరకు పంటల కొనుగోలు కోటా కేటాయింపులో కేంద్ర దృక్పధం మారాలని అయన కోరారు.

Related Posts