విసుగు పుట్టించే “ రాహు”
రివ్యూ : P.V. రామ మోహన్ నాయుడు
రాహు సినిమా లో ఎక్కడా మెరుపులు లేవు . మొదటి సగంలోను, రెండో అర్థ భాగంలోనూ ఒక్క ఆసక్తికరమైన అంశం లేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఒక్కటి కాస్త బాగుంది. రాహులో మూల కథే సాధారణమైనది. దీనికితోడు స్క్రీన్ ప్లే మరీ బలహీనంగా ఉంది. దీంతో మొత్తం సినిమా పేలవంగా నడిచింది. గుర్తుంచుకో దగ్గ సంభాషణలేవి లేవు. ప్రవీణ్ లక్కరాజు అందించిన నేపథ్య సంగీతం అర్థవంతంగా ఉంది. “ ఏమో ఏమో” పాట కూడా బాగుంది. కొత్త వాళ్ళతో సినిమా అంటే జనంలో అంచనాలు పెరుగుతున్న కాలం ఇది. చిన్న సినిమాలను పెద్ద తిమింగిలాలు బతకనీయడం లేదు అనే విమర్శ వినిపించిన ప్రతిసారి అభిరుచి ఉన్న ప్రేక్షకులు నిస్పృహకు లోనవుతారు. తమకు చెందాల్సిన మంచి వినోదాన్ని ఆ నలుగురు దక్కకుండా చేస్తున్నారనే కోపం కూడా కలుగుతూ ఉంటుంది. అయితే ఈ సినిమా చిన్న సిన్మా దర్శకుల నుంచి చూసాక వ్యర్థ ప్రయత్నాలు కూడా చాలానే ఉన్నాయనే అభిప్రాయానికి వస్తాము. సినిమాలపై అంతులేని అభినివేశంతో విదేశాల్లో చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని వచ్చిన ఈ ఎన్ ఆర్ ఐ దర్శకుడు సుబ్బు వేదుల ఏదో మెరిపిస్తాడని అభిరుచి ఉన్న ప్రేక్షకులు ఎదురు చూశారు. కాని రాహు నూరు శాతం నిరాశ కలిగించింది. పోరాట సన్నివేశాలు పర్వాలేదు. నిచ్చెన ఫైట్ బాగుంది. హీరో హీరోయిన్లయిన అబే రాం వర్మ, కీర్తి గార్గ్ లతో పాటు నటీనటులు ఎవ్వరికీ నటించే అవకాశం లేదు. ప్రభాకర్ ఇందుకు మినహాయింపు. ఉన్నంతలో బాగా చేశాడు. హిమాలయాల్లో చిత్రీకరించిన పాటలలో నటీనటులు వేసుకున్న దుస్తులు, ఆ లోకేషన్ల లో కలిసిపోయాయి. లొకేషన్ ను దృష్టిలో పెట్టుకొని ఆర్టిస్టులు ప్రముఖంగా కనిపించేలా వారి దుస్తులు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫి ఈ విషయాలపై కనీస శ్రద్ధ పెట్టాలి. ఆర్టిస్టులు లేనప్పుడు కథనే కథానాయకుడిగా రూపొందించి కోవాలి. బడ్జెట్ లో పరిమితులు ఉన్నప్పుడు వున్న వనరులను సమర్థవంతంగా వాడుకోవాలి. అలాంటి ప్రయత్నమే చేయలేదు. ఫలితంగా విసిగు పుట్టించే సినిమాగా తయారయ్యింది.
Positive
నేపథ్య సంగీతం
“ ఏమో ఏమో” పాట
ఫైట్స్
ప్రభాకర్ నటన
Negetives
కథా వస్తువు
కథనం
ట్విస్టులు లేక పోవడం
రాబోయే కథ సులభంగా బోధపడటం
ఫలితం: ఫ్లాప్
రేటింగ్: 2