సగటు సస్పెన్స్ థ్రిల్లర్ “హిట్”
రివ్యూ : P.V..రామ మోహన్ నాయుడు
హీరో నాని సమర్పించిన “ హిట్” చిత్రం సగటు సస్పెన్స్ థ్రిల్లర్. ఈ చిత్రాన్ని నాని సమర్పించడానికి ఉన్న ప్రత్యేక కారణాలు ఏవి చిత్రం లో కనిపించవు. మరో తెలంగాణా నటుడు విశ్వక్ సేన్ఇదివరకటి కంటే కాస్త మెరుగ్గా కనిపించాడు. కథ పాతదే, హిందిలో కొల్లలుగా వచ్చాయి. నడక అంతా “ రహస్య” హింది సినిమాను పోలి ఉంటుంది. “రాక్షసుడు”, “ అశ్వమేథం” పోలికలు కూడా అక్కడక్కడా కనిపిస్తూ ఉంటాయి. అయితే కథను ఆసక్తిగా నడిపించడం లో స్క్రీన్ ప్లే పాత్ర ముఖ్యమైనది. ఈ విషయంలో దర్శకుడు శైలేష్ కొలను కొంత వరకు మాత్రమే సఫలం అయ్యాడు.అయితే కథనంలో ఎగుడు దిగుళ్ళను నివారించలేక పోయాడు. సినిమా మొత్తం నేర పరిశోధన చుట్టూనే సాగుతుంది. ఇది విసుగు కలిగిస్తుంది. “ రహస్య” హింది చిత్రం లోని చూపించిన నేరాన్నే మన నేటివిటికి తగినట్లు మార్పులు చేశారు. అయితే మూల కథకు ఈ మార్పులు సరిగ్గా అతకలేదు. కృత్రిమంగా తోచాయి. రిలీఫ్ కలిగించే అంశాలు ఏవీ లేవు. హీరొయిన్ ఉన్నప్పుడు ప్రేమ సన్నివేశాలు పెట్టుకుంటే ప్రేక్షకులకు కాస్త ఊరట కలిగేది. ఇదే పొరపాటు “ సాయి శ్రీనివాస ఆత్రేయ” లో కూడా చేశారు అయితే ఆ సినిమాలో హాస్యం బాగా పండి రోమాన్స్ లేని లోటును తెలియకుండా కప్పిపుచింది. “ హిట్” లో ఆ వెసులుబాటు లేకపోవడం కొట్టొచ్చినట్లు కనిపించింది. అలాగే సస్పెన్స్ త్రిల్లర్లకు మూడ్ కు తగట్టు లైటింగ్, ఫోటోగ్రఫి, నేపథ్య సంగీతం వంటివి ప్రాణం.. అయితే సాంకేతిక అంశాలన్నీ సగటు స్థాయిలోనే ఉన్నాయి.సంభాషణలు అంతంతే. నటీనటులు ఓ.కే . గోడ పత్రికలూ, ట్రైలర్లు, ప్రచార సరళి ఈ చిత్రంపై ఆసక్తిని పెంచాయి. దీనికి తోడు నాని సమర్పించడంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. వాస్తవానికి “ హిట్” చిత్రం హిట్ అనిపించుకుకోవడంలో విఫలమయ్యింది. సగటు సస్పెన్స్ థ్రిల్లర్ గా మిగిలిపోతుంది. “ నీళ్ళు ఫుల్ గా తాగి రాకండి మధ్య మధ్యలో బాత్ రూమ్ కి వెళ్ళలేరు” ప్రచారంలో భాగంగా నటుడు విస్వాక్ సేన్ చేసిన హెచ్చరిక పెద్ద కామెడీగా చివరికి మిగిలింది
మెరుపులు
ఒక పాట
మరకలు
సగటు స్థాయిలోసాంకేతిక అంశాలు
రేటింగ్ : ౩