Highlights
పడిపోయిన ఉల్లిగడ్డల ధరలు..
తెలుగు రాష్ట్రాల్లో రెండో పంటగా సాగు
పడిపోయిన ఉల్లి ధరలు నిత్యం వినియోగించే ఉల్లిగడ్డ ధరలు బాగా పడిపోయాయి. ఇతర రాష్ర్టాల నుంచే కాకుండా తెలం గాణ జిల్లాల నుంచి కూడా పెద్ద మొత్తంలో ఉల్లి దిగుమతి జరుగుతోంది. హైదరాబాద్ నగరంలోని ప్రధాన హోల్‌సేల్ మార్కెట్‌లలో ఉల్లిగడ్డ ధర గత రెండు వారాల కంటే కూడా సగానికి సగం తగ్గిపోయింది. ప్రస్తుతం మార్కెట్‌లో హోల్‌సేల్ ధరలు క్వింటాల్‌కు రూ.400 నుంచి రూ.500 పలుకుతోంది. ఇక రిటైల్ మార్కె ట్‌లో గత రెండు వారాల క్రితం కిలో ఉల్లిగడ్డ 30 రూపాయలు పలుకగా ప్రస్తుతం 15 రూపాయలకు పడిపోయింది. తెలంగాణతో పాటు ఏపీలోనూ రైతులు ఉల్లిగడ్డను రెండో పంటగా వేశారు.