యాదాద్రి లో బ్రహ్మోత్సవాలు
యాదాద్రి భువనగిరి ఫిబ్రవరి 28
ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఇరవై ఆరోవ తేదీన స్వస్తివాచనం తో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు మార్చి ఏడవ తేదీన అష్టోత్తర శతఘటాభిషేకం తో ముగియనున్నాయి. మూడవరోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని మత్స్యావతర అలంకారంలో సేవపై నయనమనోహరంగా,వజ్ర వైడూర్యాలతో,వివిధ రకాల పుష్పాలతో అలంకరించి వేదమంత్రాలు,వేదపారాయణలు మంగళవాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా బాలాలయంలో ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. 3వ తేదీన ఎదుర్కోలు,4న తిరుకల్యాణం,5న రదోత్సవం నిర్వహించనున్నారు. ఈ పూజల్లో ఆలయ ఈవో గీతారెడ్డి, చైర్మన్ నరసింహమూర్తి భువనగిరి ఆర్డీఓ భూపాల్ రెడ్డి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.