YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

 దోచేస్తున్న ఆర్టీసీ

 దోచేస్తున్న ఆర్టీసీ

 దోచేస్తున్న ఆర్టీసీ
హైద్రాబాద్, ఫిబ్రవరి 29
సాధారణంగా ఆర్టిసిలో ఒకే రూట్‌లో వెళ్ళే బస్సులకు ఒకే చార్జీలు ఉండటం సహజం కానీ.. ఒకే రూట్‌లో రెండు రకాల బస్‌పాస్‌లను ఇస్తూ ప్రయాణికులను ఆర్టిసి అధికారులు గందరగోళానికి  గురి చేస్తున్నారు. సింకింద్రాబాద్ నుంచి 211యు ( వయా ఉప్పర్ పల్లి ) మీదుగా ఉద్దమర్రి వెళ్ళే ప్రయాణికుల వద్ద నుంచి బస్‌పాస్ రుసుం కింద రూ.1400 అదే సికింద్రాబాద్ నుంచి  211బి( వయా షామీర్ పేట ) ఉద్దమర్రి వెళ్ళే ప్రయాణికుల వద్ద నుంచి బస్‌సాప్ రుసుం కింద రూ.1700 వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇదేమిటని ప్రయాణికులకు సంబంధిత సిబ్బంది సరైన సమాధానం ఇవ్వడం లేదంటున్నారు. బస్సులు రూట్ మార్చి వెళ్ళిన సందర్భంలో కూడా గతంలో ఇంత మొత్తంలో వేరు వేరు చార్జీలు వసూలు  చేయాలదంటున్నారు.గ్రేటర్ హైదరాబాద్ పాస్ బోమ్మరాస్ పేట్‌కు (వయా ఉప్పర్ పల్లిమీదుగా వెళితే )వర్తిసుంది. కానీ అదే షామీర్ పేట మీదుగా వెళ్ళాలంటే వర్తించడం లేదు. బ్మొరాసుపేట  వరకు క టికెట్ తీసుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. అసలే ఈ మార్గంలో అధికారులు బస్సులను తక్కువగా నడిపస్తుండటంతో తాము రోజు వారీ వెళ్ళే 211యును కాకుండా 211బి బస్‌ను ఆశ్రయించాల్సి వస్తోందని తద్వారా తమకు పాస్ ఉన్నా అదనంగా మరో రూ.10 టికెట్ తీసుకుని వెళ్ళి గ్యమస్థానాలకు చేరుకోవాల్సి వస్తుందంటున్నారు. బస్సులు 
అరకొర వస్తుండటంతో తాము ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టు సౌకర్యమైన ఆటోలను ఆశ్రయించాల్సి వస్తుందని, దీంతో రెండు రకాల దోపిడికి గురవుతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అంతే  కాకుండా ఈ రూట్‌లో విద్యార్థులు, మహిళలు అధిక సంఖ్యంలో సికింద్రాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళే వారు అధికంగా ఉంటున్నారు. వారంతో సమయానికి రాని బస్సులతో ఇబ్బంది  పడుతున్నట్లు చెబుతున్నారు. సురక్షితమైన రవాణాకు పెట్టింది పేరుగాంచిన ఆర్టిసి తీరుతో తాము విసిగి తాము ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టును ఆశ్రయించాల్సి వస్తోందంటున్నారు. ఆర్టిసి ఆదాయం  పెరగాలంటే సంస్థ ఒకే రూట్‌కు రెండు బస్‌పాస్‌ల ధరలను వసూలు చేయడం కాదని, ప్రయాణికులు మెరుగైన సేవలు అందించడంతో ద్వారా వారిని ఆర్టిసివైపు ఆకర్షిస్తే యం  పెరుగుతుందని చెబతున్నారు.సికింద్రాబాద్ నుంచి ప్రతి రోజు కొన్ని వేల మంది ప్రయాణికులు ఉద్దమర్రికి రాకపోకలు సాగిస్తున్నారని, కాని ఒకే రూట్‌కు రెండు రకాలు చార్జీలు వసూలు  చేయడంతో వారు ఇబ్బంది పడుతున్నాం. అంతే కాకుండా సికింద్రాబాద్, ఉద్దమర్రి బస్సుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. ప్రతి మూడు గంటలకు ఒక బస్సు రావడంతో ప్రయాణికులు ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టును ఆశ్రయిస్తుండటంతో వారు నిలువుదోపిడికి గురికావడమే కాకుండా తరుచు ప్రమాదాల పాలవుతున్నాం. ఇకైనా అధికారులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి బస్సుల సంఖ్యను పెంచడమే కాకుండా, బస్‌పా ధరల్లో తేడాను కూడా సరి చేయాల్సిన అవసరం ఉంది.

Related Posts