YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

నయనోత్సవం...ముక్కంటి శయనోత్సవం

నయనోత్సవం...ముక్కంటి శయనోత్సవం

నయనోత్సవం...ముక్కంటి శయనోత్సవం
భక్తజనసందోహం మధ్య ఏకాంతసేవ
శ్రీకాళహస్తి ఫిబ్రవరి 29
శ్రీకాళహస్తి దేవస్తానములో ఉత్సవాలలో అత్యంత రమణీయమైనది శయనోత్సవం. బ్రహ్మోత్సవాలు ప్రారంభం నుంచి ఉత్సవాల్ని శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత  సోమస్కందమూర్తి నిర్వహించడం సంప్రదాయం.  చివరిరోజు మాత్రం శయనోత్సవని శ్రీఉమాదేవి సమేత చంద్రశేఖర స్వామి ఉత్సవ మూర్తులకు జరపడం ఈ విశేషం. ఈ విశేషోఉత్సవని పురస్కరించుకొని  వెండిపల్లకిలో ఓ వైపు చంద్రశేఖరస్వామి ఆయనకు  ఎదురుగా ఉమాదేవి ఇద్దరూ పల్లకీలో  శయనోత్సవం మండపాన్ని తరలివచ్చారు,  ఈ సందర్భంగా శయనోత్సవం మండపం ప్రత్యేక పుష్పాలంకరణలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి దేవతామూర్తులకు సుగంధ పరిమళాలు వెదజల్లే ఏలకులు లవంగాలు జీడిపప్పు  బాదంపప్పు తదితర వాటితో ప్రత్యేకంగా మాలలు తయారు చేశారు తొలుత పల్లకిలో ఉమాదేవి ని ఉంచి అమ్మవారి ఆలయం నుంచి ఊరేగింపుగా స్వామివారి ఆలయం వద్దకు  తీసుకువెళ్లారు,  అక్కడి నుంచి అమ్మవారి గర్భాలయం కొలువుదీరిన చంద్రశేఖరస్వామి ఉత్సవ మూర్తిని పల్లకిలో ఉంచి అశేష శివనామస్మరణ లు భక్తుల జయజయధ్యనుల  మద్య    త్సవమూర్తులకు ఆలయం వద్దకు తీసుకొని వచ్చారు ఆలయ అనువంశిక ప్రధాన దీక్షిగురుకుల్ స్వామినాథన్ నేతృత్వంలో శయనోత్సవం   వైభవాని ఆగమోక్తంగా నిర్వహించారు

Related Posts