సత్ఫలితాలిస్తున్న కార్డన్ అండ్ సెర్చ్
నాగర్ కర్నూల్ ఫిబ్రవరి 29
నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులు తరచూ గ్రామాలలో నిర్వహిస్తున్న కార్డన్ అండ్ సెర్చి కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తున్నది. తాజాగా పెద్ద కొత్తపల్లి మండలం చంద్రకల్ గ్రామంలో నిర్వహించిన కార్డన్ అండ్ సెర్చి కార్యక్రమంలో అక్కడి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు.పోలీసులకు సమాచారం అందివ్వడం ద్వారా నేరాలను ఎలా అదుపు చేయాలో వివరించారు. గ్రామాలలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల ప్రయోజనాలను పోలీసు అధికారులు వివరించారు. డిఎస్పీ తో బాటు సిఐ బి వెంకట్ రెడ్డి ఎస్ ఐ లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా సరైన పత్రాలు లేని 16 బైక్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.