YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నిరసనకారులను ప్రభుత్వం ఎందుకు నిలువరించలేకపోయింది: వర్ల

నిరసనకారులను ప్రభుత్వం ఎందుకు నిలువరించలేకపోయింది: వర్ల

నిరసనకారులను ప్రభుత్వం ఎందుకు నిలువరించలేకపోయింది: వర్ల
విజయవాడ ఫిబ్రవరి 29
నిరసనకారులను వైసీపీ ప్రభుత్వం ఎందుకు నిలువరించలేకపోయిందని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. విశాఖలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసుల తీరుపై శనివారం  గవర్నర్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ శాంతిభద్రతలను అదుపుచేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అల్లర్లు చేసే వారిని కంట్రోల్‌ చేయకుండా.. చంద్రబాబుని కంట్రోల్‌ చేస్తారా? అని నిలదీశారు. వైసీపీ వాళ్లను పంపించి చంద్రబాబును అడ్డుకోవడం ఎంత వరకు సబబన్నారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకొని ప్రభుత్వం ఘోర తప్పిదం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబును అరెస్ట్‌ చేయడం హాస్యాస్పదమన్నారు. విశాఖలో మొన్నటి ఘటన చూసి పోలీస్ వ్యవస్థ మొత్తం  నవ్వుకుందని అన్నారు.  చంద్రబాబు పర్యటన సజావుగా సాగేలా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని,  ఆర్టికల్ 19 ప్రకారం తమ హక్కులు కాపాడాలని గవర్నర్‌ను కోరామని వర్ల రామయ్య తెలిపారు. 

Related Posts