. 8 నెలల గర్భవతి అయినా ప్రజాప్రతినిధిగా అసెంబ్లీ సమావేశాలకు
ముంబై ఫిబ్రవరి 29
ఓ మహిళా ఎమ్మెల్యే 8 నెలల గర్భంతో అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఘటన మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో వెలుగుచూసింది. బీడ్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన 30 ఏళ్ల వయుసు గల నమితా ముందాడ మొదటిసారి గర్భం దాల్చింది. తాను 8 నెలల గర్భవతి అయినా ప్రజాప్రతినిధిగా తన నియోజకవర్గంలోని సమస్యలను సభ దృష్టికి తీసుకువెళ్లేందుకే అసెంబ్లీ సమావేశానికి వచ్చానని ఎమ్మెల్యే నమితా ముందాడ చెప్పారు.‘‘బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనడం ఎమ్మెల్యేగా నా బాధ్యత. నా బీడ్ అసెంబ్లీ ప్రజల సమస్యలను ప్రస్థావించేందుకు సమావేశానికి హాజరయ్యాను’’అని చెప్పారు నమిత. గర్భవతిగా తాను డాక్టరు సలహాలను పాటిస్తూనే ప్రజల కోసం అసెంబ్లీ సమావేశానికి వచ్చానని నమిత చెప్పారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నమిత బీజేపీలో చేరి బీడ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.