YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వేడెక్కిన విశాఖ రాజకీయాలు

వేడెక్కిన విశాఖ రాజకీయాలు

వేడెక్కిన విశాఖ రాజకీయాలు
విశాఖపట్నం ఫిబ్రవరి 29 
విశాఖ‌లో టిడిపి అధినేత చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న అధికార ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మాట‌ల వైరానికి కార‌ణ‌మైంది. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌పై ముందు నుంచి వైసీపీ నేత‌లు వ్య‌తిరేకిస్తునే ఉన్నారు. విశాఖ‌ను ఎగ్జిక్యూటివ్ క్యాపిట‌ల్ గా అంగీక‌రించ‌ని చంద్ర‌బాబు ఏవిధంగా విశాఖ‌లో ప‌ర్యటిస్తార‌ని ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు విశాఖ‌కు వ‌స్తున్న వైసీపీ నేతుల ఆందోళ‌న చేప‌ట్టారు. చివ‌రికి చంద్ర‌బాబు వెనుదిర‌గ‌డం టిడిపి నేత‌లు వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పిడంచడంతో విశాఖ‌లో రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడెక్కింది.మూడేళ్ల క్రితం ఇలాగే విశాఖలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అడ్డుకున్న విషయం తెలిసిందే. గ‌తంలో జ‌గ‌న్ విశాఖ వ‌స్తే అడ్డుకున్న టిడిపికి త‌గిన శాస్తి జ‌రిగింద‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు.పులివెందుల నుంచి ఒక్కరు వచ్చినట్లు నిరూపించకపోతే.. చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని మంత్రి అవంతి శ్రీనివాస్‌ సవాల్‌ విసిరారు.ఆయన నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమన్నారు.చంద్రబాబు తన స్వార్థం కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకి ప్రభుత్వం పూర్తిగా రక్షణ కల్పించిందని..పోలీసులు చట్టానికి లోబడే పనిచేస్తారని తెలిపారు. ఇళ్లకి వచ్చి దౌర్జన్యాలు చేస్తామని లోకేష్‌ అనడం దారుణమన్నారు. ఆయన వ్యాఖ్యల వల్లే ఉత్తరాంధ్ర ప్రజలు చంద్రబాబును అడ్డుకున్నారని పేర్కొన్నారు. అన్ని జిల్లాలు, ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అవంతి చెప్పారు.విశాఖ పరిపాలన రాజధానికి టీడీపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలుపుతారో లేదో తేల్చి చెప్పాలన్నారు. విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు అమరావతికే మద్దతు తెలిపితే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు దుర్మార్గపు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు పై ఉత్తరాంధ్ర ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని,మండును సైతం లెక్కచెయ్యకుండా ప్రజలు ధర్నా చేశారని అన్నారు.  విశాఖ ప‌ర్య‌ట‌కు వ‌చ్చిన చంద్ర‌బాబు కాన్వ‌య్ కు అడ్డం ప‌డిన‌  వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు బాబును ఎయిర్‌పోర్టు నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు.కాన్వాయ్ ముందు బైఠాయించి.. మరికొందరు పడుకొని నిరసన తెలిపారు. దీనిపై టిడిపి నేత‌లు ఘాటుగానే స్పందిస్తున్నారు. పెయిడ్ ఆర్టిష్టుల‌ను తీసుకొచ్చిన ఆందోళ‌న చెయ్యిస్తున్నార‌ని టిడిపి నేతలు ఆరోపించారు. వైసీపీ ప్ర‌భ‌త్వ హాయంలో అన్యాయం జ‌రిగిన భాదితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వ‌స్తున్న చంద్ర‌బాబు అడ్డుకోవ‌డం స‌రికాద‌ని అన్నారు.విశాఖలో పులివెందుల తరహా ఫ్యాక్షన్‌ రాజకీయాలను ప్రవేశపెట్టి, ప్రశాంత నగరాన్ని దెబ్బతీసేలా జగన్‌ ప్రవర్తిస్తున్నారు.చంద్రబాబును చూసి వైసీపీ నేతలు భయపడుతున్నారపి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణ అన్నారు.విశాఖ చరిత్రలోనే బ్లాక్‌డేగా నిలిచిపోతుందని టిడిపి మహిళా నేత అనిత అన్నారు.ఈ ఘటనను ముత్తంశెట్టి, రోజా సమర్ధించడం దారుణమని,ఏడాది క్రితం వరకు టిడిపి ఎంపీగా కొనసాగిన అవంతి శ్రీనివాస్ చంద్రబాబు హయాంలో ఎంత ప్రగతి జరిగిందో తెలియదా అని ప్రశ్నించారు. విశాఖ ఎయిర్ పోర్ట్ సాక్షిగా మాజీ, తాజా సీఎంల మధ్య సాగిన పగ, ప్రతీకారం ఎపిసోడ్ లు భ‌విష్య‌త్ లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తోందో చూడాల్సిందే.

Related Posts