YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఫలించిన మంత్రి వేముల వ్యూహం

ఫలించిన మంత్రి వేముల వ్యూహం

ఫలించిన మంత్రి వేముల వ్యూహం
నిజామాబాద్ జిల్లా డిసిసిబి, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ ఛైర్మన్లు ఏకగ్రీవ ఎన్నిక
నిజామాబాద్ ఫిబ్రవరి 29 
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి,డీసీఎంఎస్ ఎన్నికల్లో రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యూహం  ఫలించింది.టిఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం ఆదేశానుసారం ఎన్నికల్లో యకుల్ని,ఎమ్మెల్యేల సహకారంతో సమన్వయపరుస్తూ అన్ని డైరెక్టర్ స్థానాలు ఏకగ్రీవం అయ్యేలా కృషి చేసారు.అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ నిర్ణయించిన అభ్యర్థులు, చైర్మన్, వైస్ చైర్మన్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా పక్కా ప్రణాళిక తో పనిచేశారు.ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులను సమన్వయ పరుస్తూ, అసంతృప్తులను బుజ్జగిస్తూ ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరిగేలా కృషి చేశారు.డిసిసిబి చైర్మన్ గా పోచారం భాస్కర్ రెడ్డి,వైస్ చైర్మన్ గా కె. రమేష్ రెడ్డి. డీసీఎంఎస్ చైర్మన్ గా సాంబారి మోహన్, వైస్ చైర్మన్ గా ఇంద్ర సేనారెడ్డి లను పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని సీల్డు కవర్ లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి,సివిల్ సప్లై చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తీసుకురాగా, మంత్రి దాన్ని విప్పి పార్టీ నిర్ణయాన్ని అందరూ డైరెక్టర్ లకు తెలియజేసి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం  అయ్యేలా చేసారు.చైర్మన్,వైస్ చైర్మన్ ల ఎన్నిక అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ డిసిసిబి,డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.అందుకు కృషి చేసిన  డైరెక్టర్లందరికి నా కృతజ్ఞతలని అన్నారు. పార్టీ అధినేత సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని డైరెక్టర్లకు చెప్పగానే అందరూ వారి నిర్ణయాన్ని గౌరవించారు.అందుకు నా ప్రత్యేక ధన్యవాదాలని అన్నారు. ఉమ్మడి జిల్లాలో 144 పీఏసీ చైర్మన్ స్థానాలకు గాను 136 చైర్మన్ స్థానాల్లో టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. టిఆర్ఎస్ పార్టీని ఆదరించిన రైతులకు నా ధన్యవాదాలు జిల్లాలో  డిసిసిబి,డీసీఎంఎస్ లలో కలిపి మొత్తం డైరెక్టర్ స్థానాలు 30 ఉన్నాయి.ఒకటి ఎన్నిక జరగలేదు.29 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.మొత్తం స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అన్ని ఏకగ్రీవం  అయ్యేలా మా గౌరవ ఎమ్మెల్యేలు సహకారాన్ని అందించారు.వారికి హృదపూర్వక ధన్యవాదాలు. నూతనంగా ఎన్నికైన డైరెక్టర్లకు చైర్మన్, వైస్ చైర్మన్ లకు పార్టీ పక్షాన, నా పక్షాన  శుభాకాంక్షలని అన్నారు.

Related Posts