YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఇంటి స్థలాల పేరిట వ్యవసాయ భూముల స్వాధీనానికి యత్నం

ఇంటి స్థలాల పేరిట వ్యవసాయ భూముల స్వాధీనానికి యత్నం

ఇంటి స్థలాల పేరిట వ్యవసాయ భూముల స్వాధీనానికి యత్నం
 నెల్లూరు ఫిబ్రవరి 29 
 ఇంటి స్థలాల పేరిట వ్యవసాయ భూములను ప్రభుత్వం స్వాధీనం  చేసుకునేందుకు ప్రయత్నిస్తుందని నెల్లూరు గ్రామీణ నియోజవర్గ పరిధిలోని బాధితులు ఒక సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొల్ల కందుకూరు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 218 లో10 ఎకరాల85 సెంట్ల ప్రభుత్వ భూమి ఉండగా అందులో 3 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు పొలమును గత50 సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన టి .  మాలకొండయ్య, సిహెచ్, వీర రాఘవులు. మహేంద్ర, తాడిపత్రి సుధాకర్ తదితరులకు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందన్నారు. అప్పటినుండి వర్షం ఆధారిత పైర్లు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నామని తెలియజేశారు. కాలక్రమేణా మా పొలాలకు సమీపములో ఉన్న తోటి రైతులకు సంబంధించిన  వ్యవసాయ మోటార్లు నుండి నీళ్లు వాడుకుంటూ వేరుశనగ, మిరప, వివిధ రకాల కూరగాయలు పంటలు పండించుకుని జీవనం సాగిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి స్థలాలు లేనివారికి ఉగాది కానుకగా ఇంటి నివేశన స్థలాలు పంపిణీ కార్యక్రమంలో మా వ్యవసాయ భూములను గ్రామంలోని కొందరికి ఇంటి  నివేశన స్థలాలు పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తమ ఆవేదనను వ్యక్తపరిచారు. మా పొలం కి సంబంధించి ఎంతో కాలం నుండి భూమిశిస్తు చెల్లి స్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో అధికారులకు , గ్రామంలోని కొందరు నాయకులకు మేము వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లు సృష్టిస్తున్నారని చెప్పారు. మాకు వ్యవసాయ ఆధారిత మైన మా పొలాలను ఇంటి నివేశన స్థలాలు  పంపిణీ చేసే ప్రక్రియను నిలుపుదల చేయాలని ఈ నెల 7వ తేదీ జిల్లా కలెక్టర్ మరియు ఆర్ డి లకు స్పందన కార్యక్రమం ద్వారా విన్నవించుకుని ఉన్నామని తెలిపారు. ఈ విషయమై  సంబంధిత అధికారులు స్పందించి మా సాగులో ఉన్న వ్యవసాయ భూములను ఇంటి నివేశన స్థలాలు పంపిణీ చేయు ప్రక్రియ నుండి తొలగించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో తాటిపర్తి మాలకొండయ్య, సుధాకర్, సిహెచ్ వీర రాఘవులు, సురేంద్ర, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts