బ్యాక్ గ్రౌండ్ ఉన్నా హీరోగా రాణించడం సులువేం కాదు!- ‘ఓ పిట్ట కథ ‘ హీరో సంజయ్ రావు
నటుడు బ్రహ్మాజీ వారసుడు సంజయ్ రావు హీరోగా పరిచయమవుతున్న చిత్రం `ఓ పిట్టకథ`. అగ్ర నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ పతాకంపై చెందు ముద్దుని దర్శకుడిగాపరిచయం చేస్తూ వి.ఆనందప్రసాద్ నిర్మించారు. విశ్వంత్ దుద్దుంపూడి, నిత్యాశెట్టి హీరోహీరోయిన్లు గా నటించారు. చిత్రీకరణ పూర్తయి మార్చి 6న విడుదలవుతోంది. ఈసందర్భంగా హీరో సంజయ్ రావు మీడియాతో ముచ్చటించారు. ఆ సంగతులివి.. ఇదే తొలి పరిచయ చిత్రమా? *బాలనటుడిగా ప్రయత్నించాను కానీ కుదరలేదు. `లిటిల్ సోల్జర్స్` ఆడిషన్స్ కి వెళ్లాను. రెండో తరగతి లో ఉన్నప్పుడు నాన్న గారు (బ్రహ్మాజీ) ఆడిషన్స్ కి తీసుకెళ్లారు. సినిమాఅంటే డాడీ వల్లనే. మర్చంట్ నేవీ జాబ్ వదిలేశాక పూర్తిగా నటనలోకి వచ్చాను. బీఎస్సీనాటికల్ సైన్స్ పూర్తి చేసి అటుపై యుకేలో మాస్టర్స్ చేశాను. రియో డి జెనీరో.. ఆమ్ స్టర్డామ్ లో ఉద్యోగం చేశాను. ఆ టైమ్ లోనే ఏదో అసంతృప్తి. డబ్బు సంపాదన తప్పఇంకేమీ ఉండదా? అనిపించింది. బ్యాంక్ ఖాతాలో డబ్బు ఉందని చెప్పుకోవడం తప్పఇంకేదీ లేదేమో అనిపించింది. అందుకే క్రియేటివ్ సైడ్ రావాలని అనుకున్నాను. కెరీర్ పరంగా డాడీ సలహా ఏదైనా? *కృష్ణ వంశీ గారు.. రవితేజ గారు.. నటనలోకి రావచ్చు కదా అని అడిగేవారు. 12వతరగతి తర్వాత వాడే నిర్ణయించుకుంటాడు అనుకున్నారు నాన్న. అయితే విదేశాల్లోఆరేళ్ల అనుభవం తర్వాత క్రియేటివ్ సైడ్ వచ్చేస్తాను అంటే నాన్నగారు ఓకే అన్నారు. నటన.. దర్శకత్వం డీవోపీ ఏదీ అనుకోలేదు. బాంబే పంపించారు. మనోజ్ బాజ్ పాయ్.. ఆషిశ్ గాంధీ వంటి ప్రముఖుల్ని ట్రైన్ చేసిన శిక్షకుడి వద్దనే నటన నేర్చుకున్నా. ఏడాదిన్నరశిక్షణ తర్వాత తెలుగు పరిశ్రమ ప్రభావం శైలి ఉండాలని దేవదాస్ కనకాల వద్ద 6నెలలకోర్స్ చేశాను. అటుపై కృష్ణ వంశీ గారి వద్ద నక్షత్రం సినిమాకి జాయిన్ అయ్యాను. 24 క్రాఫ్టులు నేర్చుకుని రమ్మని ఆయన ప్రోత్సహించారు. బేస్ లైన్ స్ట్రాంగ్ గా ఉండాలి అనిప్రోత్సహించారు. కావాలనుకుంటే నాన్న(బ్రహ్మాజీ) గారి అండతో స్టార్ డైరెక్టర్ తో లాంచ్ అవ్వొచ్చు.. కదా? బ్యాక్ గ్రౌండ్ ఉంటే అన్నీ ఈజీ అనుకుంటారు. కానీ అది అలా రాదు. అలా అనుకోవడంతక్కువ ఆలోచన. ప్లస్ 2 నుంచి సాయి ధరమ్ తేజ్ పరిచయం. తను చాలా కష్టపడ్డాడు. అంత సులువేమీ కాదు ఇక్కడ. నాకు కూడా అనుభవం అయ్యింది. నాలుగేళ్లు ఈ సినిమాకోసం వేచి చూశాను. బయటవాళ్లకు తెలీని కష్టమిది. అన్నీ వదిలేసి క్రియేటివ్ సైడ్ వెళితే ఇంట్లో బాధపడలేదా? ఉద్యోగం వదిలేశాక... నటనలోకి రావాలనుకున్నప్పుడు ఆరు నెలలు ముంబై వెళ్లా. ఇక్కడకమ్యూనికేషన్ లేదు. కానీ చాలా నేర్చుకున్నా. ఇక పరిశ్రమలో నాన్నగారి మార్గదర్శనంఉంటుంది. తప్పా ఒప్పా కాదు పడి లేస్తూ నేర్చుకో అని చెబుతారు. సలహాలిస్తారు. ఈ సినిమాకి ముందు వేరే ఏ సినిమాలోనూ నటించలేదా? పూరి వద్ద కోడైరెక్టర్ గా పని చేసిన కిషన్ కృష్ణ వద్ద ఓ సినిమా చేశాను. మూడువైవిధ్యమైన కథలతో తెరకెక్కుతున్న సినిమా అది. త్వరలో రిలీజ్ కి రానుంది. అంతకంటేముందే పిట్టకథ రిలీజవుతోంది. పిట్ట కథ స్టోరీ లైన్? ముక్కోణపు ప్రేమ కథ అనుకుంటున్నారు కానీ కాదు. ఇందులో కేవలం ప్రేమకథే కాదుచాలా ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. దర్శకుడు చందుతో అనుబంధం? చందు సర్ తో మూడేళ్ల ప్రయాణం సాగించాను. దాంతో కంఫర్ట్ లెవల్ ఉంది. ఇతరనటీనటులతోనూ ట్రావెల్ అయ్యాను కాబట్టి సౌకర్యంగానే సాగింది. చిన్న సమస్యలుఉన్నా చందు కరెక్ట్ చేశారు. కెమెరాని ప్రేమించి నటిస్తాను. చిన్న స్టేజ్ ఫియర్ ఉంది. కెమెరాముందు ఫెయింట్ అవుతాను. కానీ కరెక్టయ్యాను.ఇందులో మీ పాత్ర ఎలాంటిది? అమలాపురంలో ఒక లోకల్ అబ్బాయి... థియేటర్ లో పని చేసే కుర్రాడి కథ.. సింగిల్స్క్రీన్ థియేటర్ క్లీనింగ్ నుంచి టిక్కెట్లు అమ్మడం వరకూ అన్నీ నేనే. అమలాపురం పక్కనేమా డాడీ ఊరు. అందుకే పండగలకు వెళ్లేవాడిని. ప్రతి సంక్రాంతికి పదిరోజులు అక్కడే. అమ్మ ఊరు పశ్చిమ బెంగాళ్ లో ఉంది. అక్కడికి కూడా వెళ్లాను. మూవీలో రోల్ కోసంహోంవర్క్ చేశాను. క్యారెక్టర్ ప్రిపరేషన్ గురించి? పాత్ర కోసం సిటీలో సింగిల్ స్క్రీన్స్ కి వెళ్లి అక్కడి పనివారిని చూశాను. పదిమందినీపరిశీలించి నేర్చుకో.. ఏది నచ్చితే అదే క్యారెక్టర్ కి ఆపాదించుకో అదే ఫాలో అవ్వు అనిచందు తెలిపారు. తొలిసారి డాడీతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు కదా?నెర్వస్ లేదు కానీ.. ఆయన నా నటన గురించి ఏమనుకుంటారో అనిపించేది. అమ్మ నాన్ననా వైఫ్ అందరూ నటనలో ఇంప్రూవైజేషన్ చెప్పేవారు. ఆ ముగ్గురూ ఒకరికొకరు ఫిల్టర్చేశాక ఫైనల్ గా నాకు నేనుగా మెరుగు పడడం ఎలాగో నేర్చుకున్నానన్నమాట. ఇంట్లో మిమ్మల్ని ఏదీ అనరా? నేను చిన్నప్పుడు ఇంట్లోంచి పారిపోయా. పది రోజులు బయటే ఉన్నాను. నేను అంతసెన్సిటివ్. అందువల్ల జాగ్రత్తగానే ఉంటారు. ఫస్ట్ కాపీ చూశారా? చూశాను. 70ఎంఎం స్క్రీన్ లో రిఫ్లెక్ట్ అవుతున్నానా అనిపించింది. నేను నటుడుఅవుతానని ఎప్పుడూ అనుకోలేదు. ఇంకా కలలానే ఉంది.మీ మదర్ గురించి?అమ్మ పెద్ద కంపెనీలో ఉద్యోగి. సింగపూర్ సహా టూర్స్ వెళ్లేప్పుడు నన్ను అమ్మమ్మ ఇంట్లోఉంచేది. అలాగే కజిన్ సిస్టర్ ఉన్నారు. అయితే తనని ఎప్పుడూ కజిన్ అనుకోలేదు. ఇప్పుడు క్లారిటీ కోసమే చెబుతున్నా. మీ భార్య గురించి? నా భార్య అనుకృతి. తను ఎక్స్ పైలెట్. పైలెట్ శిక్షణ కూడా ఇచ్చింది. మర్చంట్ నేవీలోఉన్నప్పుడు ఫ్రెండ్స్ ద్వారా ఓ పార్టీలో తను కలిసింది. మాది ప్రేమ వివాహం. తను నాకోసం జాబ్ వదిలేసి వచ్చేసింది. నేను పిట్టకథతో హీరోగా వచ్చానంటే తనవల్లనే. అమ్మపుట్టుకను ఇస్తే.. నా వైఫ్ నా జీవితాన్ని నిలబెట్టింది. సోలో హీరోగా చేయరా? సినిమా అంటే కథను చెప్పడం. పాత్రలతో నడిచేది సినిమా. అన్ని పాత్రలు బావుండాలి. మంచి పాత్రల్లో నటించాలి అనుకుంటాను.