న్యూఢిల్లీ డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి మరింత సులభతరం కానుంది. లర్నర్స్ లైసెన్స్, కొత్త డీఎల్, డీఎల్ పునరుద్ధరణ, పేరు, అడ్రస్ మార్పులు చేయడానికి ఇకనుంచి ఐదు వేర్వేరు ఫారాలు నింపాల్సిన అవసరం లేదు. వీటన్నింటిని నింపడానికి ఇకపై ఒక కొత్త ఫాం ఇస్తారు. ఈ ఫాం ఆన్‌లైన్లో దొరుకుతుంది.డీఎల్ ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టంలో కొన్ని మార్పులు చేసింది. ఏప్రిల్ 1 నుంచి అన్ని ఆర్టీవో కార్యాలయాల్లో ఈ కొత్త ఫాం ఇస్తారు. కొత్త మోటారు వాహన చట్టంలో 10, 14(1), 17(1) (18) నియమాన్ని తొలగించారు. దీనిస్థానంలో ఫాం-2 ను పరిచయంచేస్తారు. ఇకపై అన్నింటికీ ఈ ఫాంనే ఉపయోగించాల్సి ఉంటుంది.