YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

కదులుతున్న డొంక  నకిలీ పట్టాలపై సభాపతి ఆగ్రహం 

కదులుతున్న డొంక  నకిలీ పట్టాలపై సభాపతి ఆగ్రహం 

 కదులుతున్న డొంక  నకిలీ పట్టాలపై సభాపతి ఆగ్రహం 
కామారెడ్డి ఫిబ్రవరి 29 
కామారెడ్డి జిల్లా లోని బాన్సువాడ పట్నంలోని తాడుకోల్ శివారులో ఇళ్ల స్థలాల నకిలీ పట్టాలు వెలుగుచూశాయి , రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు వారివి పూరిగుడిసెలో మట్టితో కట్టే ఇల్లు  వారి నివాసం అలాంటి నిరుపేదలు మోసగాళ్లు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసి నకిలీ పట్టాలు అంటగట్టారు పట్టణంలో వందకుపైగా వీరికి అందించినట్లు తెలుస్తుంది .
స్థానికులు ఈ విషయం సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు, దీంతో నకిలీ లను సృష్టించే వారిపై క్రిమినల్ కేసు పెట్టాలని అధికారులను ఆదేశించారు,ఇళ్ల పట్టాల కోసం నకిలీ న్మమి మోసపోవద్దని ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని పోచారం  శ్రీనివాసరెడ్డి చెప్పారు. దీంతో ఈ విషయంపై అధికారులు విచారణ చేపట్టారు మరోవైపు పట్టాలు అసలు ఉన్నాయో లేదో  అని నిరుపేదలు ఆందోళన చెందుతున్నారు, సంగమేశ్వర కాలనీ లో 90 ఎకరాలు,  35 ఎకరాలు బీడీ వర్కర్స్ కాలనీ లో , తాడికొండలో 20 ఎకరాలు ప్రభుత్వం కొనుగోలు చేసి  అర్హులకు ప్లాట్లు కేటాయించారు ,  కొన్నేళ్ళ క్రితం నిరుపేదలకు గుర్తించి కేటాయించే విషయంలో జరిగిన తప్పిదం వల్ల అనర్హులు పట్టాలు పొందారు వారు ఆ పట్టాలను అమ్ముకున్నారు,  స్పీకర్ ఆదేశాల మేరకు అనర్హులను బోగస్ లబ్ధిదారులను ఏరివేసి అర్హులైన వారిని గుర్తించి 217 మంది కి పాఠాలు అందించారు పట్టాలు పొందిన వారందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి  ఒక్కొక్క ఇంటికి రూపాయలు 5.04 లక్షల వ్యయం తో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించారు నిర్మాణాలు పూర్తి కావడంతో పట్టణంలో కిరాయి ఉంటున్న వారు గుడిసెల్లో ఉంటున్న  నిరుపేదలనుగుర్తించి ఇళ్లు కేటాయించాలని స్పీకర్ ఆదేశించడంతో మరోమారు అధికారులు విచారణ చేపట్టారు.అయితే ఈ 300 మంది వరకు పట్టాలతో వచ్చి రెవెన్యూ అధికారులు కలిసి తమకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని కోరడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది సుమారు 100 పైగా నకిలీ నకిలీ పట్టలు నున్నట్లు తెలుస్తోంది.నకిలీ పటాలకు  అసలుకు తేడా లేకుండా తయారు చేసి స్టాంపు లతో సంతకాలతో అందించడమే వెనుక ఎవరి హస్తం ఉందని అంశంపై చర్చ జరుగుతుంది వీటిని బాన్స్వాడ లోని ప్రింటింగ్ ప్రెస్ లో తయారు  చేయించారని తెలుస్తుంది నకిలీ పట్టాలను అందజేసిన వారు ఎవరు , వారికి రెవెన్యూ అధికారుల సహకారం ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు అయితే నకిలీ పట్టాలను  పొందిన వారు ఇప్పటికీ వారు ఎవరి పేరును వెల్లడించలేదని సమాచారం , నకిలీ పట్టాలపై ప్లాట్ నెంబర్ వేయడం స్టాంపులు తయారు చేయడం నకిలీ సంతకాలు చేయడం ఏ ఒక్కరితో అయ్యేపని కాదు కొంతమంది కలిసి ఈ అక్రమానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు . ఈ విషయంలో సభాపతి వార్డులో స్వయంగా పర్యటించి విచారణ చేస్తున్నారు.దీనిపై బాన్స్వాడ  తాసిల్దార్ గంగాధర్ వివరణ కోరగా నకిలీ పట్టాల వ్యవహారం మా దృష్టికి రాలేదు సభాపతి దృష్టికి వచ్చినట్లు తెలిసింది విచారణ చేస్తున్నాము విచారణ పూర్తయ్యాక ఉన్నత అధికారులకు  నివేదిక అందజేస్తామన్నారు

Related Posts