YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 ప్రభుత్వానికి స్థానిక టెన్షన్

 ప్రభుత్వానికి స్థానిక టెన్షన్

 ప్రభుత్వానికి స్థానిక టెన్షన్
విజయవాడ, మార్చి 2
మార్చి నెలాఖరులోగా స్థానిక ఎన్నికలను తప్పనిసరిగా పూర్తి చేయాలిసిన పరిస్థితి ఎపి సర్కార్ పై పడింది. ఈనెల 31 వ తేదీ లోపు స్థానిక ఎన్నికలు పూర్తి కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 14 ఆర్ధిక సంఘం నుంచి రావాలిసిన నిధులకు బ్రేక్ పడనుంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన 59 శాతం రిజర్వేషన్ల అంశం పై తీర్పును హై కోర్టు రిజర్వ్ చేసి ఉంచింది. ఆ తీర్పు వెలువడిన వెంటనే ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సమాయత్తం అయిపొయింది.రిజర్వేషన్లపై తీర్పు ఎలా వచ్చినా దానికి అనుగుణంగా తక్షణ ఎన్నికలకు ఈసి కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఏపీ లోని పంచాయితీలు, మునిసిపాలిటీ, కార్పొరేషన్ లకు సంబంధించి అన్ని లెక్కలతో అధికార యంత్రాంగం సమాయత్తం అయ్యింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం ఆర్ధిక పరిస్థితి దినదినగండంగానే నడుస్తుంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే 14 ఆర్ధిక సంఘం విడుదల చేసే 3 వేలకోట్ల రూపాయలకు పైబడి నిధులు  వెనక్కి పోతాయి. అదే జరిగితే మూలిగే నక్కపై తాటిపండు పడినట్లే.దాంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలాఖరు లోపు ఎన్నికలు నిర్వహించాలనేది జగన్ సర్కార్ సంకల్పం గా వుంది. వైసిపి ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తున్న 59 శాతం రిజర్వేషన్లు కి వ్యతిరేకంగా తీర్పు వచ్చినా కోర్టు డైరెక్షన్ ప్రకారం ఎన్నికల ప్రక్రియ నడిపించేయాలన్నదే సర్కార్ ఆలోచనగా తెలుస్తుంది.  అందువల్లే ప్రభుత్వ సంక్షేమ పథకాల జోరును బాగా పెంచారని తెలుస్తుంది.  పంచాయతీ ఎన్నికల ప్రక్రియను 13 రోజుల నుంచి 15 రోజులకు పెంచే చట్టానికి ఆమోదముద్ర వేసింది. పంచాయతీ ప్రచారం 5 రోజులు నిర్వహించుకునేలా గడువివ్వనుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికల ప్రచారానికి 7 రోజుల సమయమివ్వనుంది. గిరిజన ప్రాంతాల్లో సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీల పోటీకి గిరిజనులు మాత్రమే అర్హులని నిర్ణయించింది. సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు కచ్చితంగా గ్రామాల్లోనే ఉండాలన్న నిబంధన విధించనున్నారు. పంచాయతీ  ఎన్నికలకు ఇచ్చినట్టే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు కూడా కేవలం 15 రోజులే కేబినెట్ నిర్ణయించడం విశేషం.ఇప్పటికే టిడిపి ప్రజాచైతన్య యాత్రల పేరిట ప్రజల్లోకి వెళ్ళింది. బిజెపి, జనసేన  జట్టుగా స్థానిక ఎన్నికలకు రెడీ అని ప్రకటించేశాయి. ఇక కోర్టు తీర్పు వెలువడటమే తరువాయి అంటుంది 

Related Posts