ఆసుపత్రిలో వసతుల లేమి
నిజామాబాద్ మార్చి 2
నిజామాబాద్ జిల్లా కేంద్రం లో పేద ప్రజల కోసం నిర్మించిన ఆసుపత్రి లో సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్న ప్రజలు.ఐతే అసలే ఎండాకాలం వ్యాది నిర్దారణ పరికశాలకోసం ఇచ్చే నమూనాలను బాద్ర పరిచే ఫ్రిజ్ లు పని చేయక పోవడం ఎందుకు ప్రధాన కారణం.వ్యాధి నిర్ధారణలో రక్త పరీక్షలే కీలక పాత్ర పోషిస్తాయి.వీటి ఆధారంగానే వైద్యులు రోగికి మందులు రాస్తారు. పరీక్షలు చేసేందుకు ఉపయోగించే రసాయనాలకు పెద్దాసుపత్రిలో రక్షణ కరవైంది.రక్త పరీక్ష కేంద్రంలో ఫ్రిజ్లు పనిచేయడం లేదు.ఇందులోనే రసాయనాలు నిల్వ చేస్తున్నారు. నిబంధనల ప్రకారం వీటిని తగినంత ఉష్ణోగ్రతలో ఉంచాలి. అప్పుడే సరైన ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది.పేదలకు వైద్యం అంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విషయం ఇక్కడ స్పష్టమవుతోంది. పని చేయని ఫ్రిజ్జుల్లో రక్త పరీక్షలు చేసే రసాయనాలను ఉంచుతు న్నారు. ఐతే ఆరు నెలలుగా వీటిని బాగు చేయించాలని కోరుతుంటే పట్టించుకొనేవారు లేరని సిబ్బంది చెపుతున్నారు.ఇది జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి దుస్థితి. ఇప్పుడే వేడి పెరుగుతున్న తరుణం లో వచ్చేది వేసవి కాలం కావడంతో రసాయనాలను తగినంత ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది. లేకపోతే రోగుల పరీక్షల నివేదికలు తప్పుల తడకగా మారనున్నాయని ఆ రోగులు ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది.మరోవైపుజిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పనిచేయని ఫ్రిజ్లో నిల్వచేసిన రసాయనాలు నిత్యం 500 వరకు రక్త పరీక్షలు చేస్తున్నారు.వైద్య కళాశాల ఏర్పడి ఆరేళ్లు గడిచినా ఇప్పటికీ సరైన పరికరాలు లేక అవస్తలు పడుతు పాత పరికరాలతోనే కాలం వెళ్లదీస్తున్నారు.ఇటీవల 50 లక్షలతో అత్యాధునిక పరికరాన్ని ప్రభుత్వం పంపిస్తే ఎలుకలు కొట్టేశాయి.నిత్యం వందల సంఖ్యలో రక్తపరీక్షలు చేసేందుకు ఒకే ఒక్క ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నారు. శిక్షణ కోసం వచ్చిన నర్సింగ్ విద్యార్థులే రక్త పరీక్షలు చేస్తున్నారు.జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిగా ఉన్న సమయంలో కొనుగోలు చేసిన ఫ్రిజ్లను ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు.వీటిలో రసాయనాలు నిల్వచేసిన డబ్బాల్లో ఐస్గడ్డలు కడుతున్నా పట్టించుకొనేవారు లేరని ఆరోపణలు ముతగాట్టుకుంటున్న ఆసుపత్రి సిబ్బంది. వైద్య కళాశాల ఏర్పడిన తర్వాత కొనుగోలు చేసిన ఫ్రిజ్లు మూలన పడటంతో వీటిని బాగు చేయించాలని సంబంధిత విభాగం అధికారులు కోరి ఆరు నెలలు గడిచిన ఇంకా వాటి వంక ఎవరూ చూడక పోవడం విడ్డురం.అసలే పని చేయని ఫ్రిజ్లు,వీటికి తోడూ అందులో ఉంచినకొన్ని రసాయనాల కాలంచెల్లిన వాటినివాడటం బాదాకరం.నెలలు గడుస్తున్నా ని పట్టించుకొనేవారులేరు.ఇదేమిటని ప్రశ్నిస్తే వాటిని ఉపయోగించడంలేదని పారేస్తామం టూ సమాధానం ఇస్తున్నా సిబ్బంది.నిబంధనల ప్రకారం కాలం చెల్లిన రసాయనా లను ఎప్పటికప్పుడు గుర్తించి పారేయాల్సి ఉంటుంది.ఈ విషయం ఇప్పటి వరకు నా దృష్టికి రాలేదు.రెండు రోజుల్లో ఫ్రిజ్లు కొనుగోలు చేసి సంబంధిత విభాగానికి అందజేస్తాంమని చెపుతున్నారు ఆసుపత్రి లో డాక్టర్లు. ఏదేమైనా వచ్చేది ఎండాకాలం అని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కానీ, ప్రభుత అధికారులు కాని పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన పేద్ద ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించి రసాయనాలు నిల్వ కోసం సరిపడా వస్తువులు సమకూర్చి మంచి వైద్యం అందించాలని కోరుకుందాం.