YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం తెలంగాణ

యదేచ్చగా మంచి నీటి వ్యాపారం

యదేచ్చగా మంచి నీటి వ్యాపారం

యదేచ్చగా మంచి నీటి వ్యాపారం
మెదక్, మార్చి 2,
జహీరాబాద్‌ ప్రాంతంలో నీటి కష్టాలు ప్రారంభం కావడంతో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. బోర్లల్లో నీరు అడుగట్టిపోవడంతో స్వచ్ఛమైన నీరు రావడం లేదు. దీంతో ప్రజలు  నీటిని కొనుగోలు చేసి తాగాల్సిన దుస్థితి నెలకొంది. దీన్ని అదునుగా చేసుకుని కొందరు మినరల్‌ ప్లాంట్ల నిర్వాహకులు తమ వ్యాపారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. అంతే కాకుండా వారం  రోజుల వ్యవధిలోనే జహీరాబాద్‌ పట్టణంలో 12 నుంచి 15 వరకు నూతన మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటైనట్టు తెలుస్తోంది. ప్రజల అవసరాలను వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.  20 లీటర్ల బాటిల్‌ను రూ.20 నుంచి రూ.25 వరకు వసూలు చేస్తున్నారు. వాటర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసి 20 లీటర్ల డబ్బాల ద్వారా ఇంటింటికీ నీటిని సరఫరా చేస్తున్నారు. జహీరాబాద్‌లో ప్రస్తుతం 56 వాటర్‌ ప్లాంట్లున్నాయి. వీటిలో చాలా వరకు ఐఎస్‌ఐ స్టాండెడ్‌ పాటించడం లేదు. కొన్ని ప్లాంట్లు నీటిని శుద్ధి చేస్తున్నా, మరీ కొన్ని ప్లాంట్లల్లో శుద్ధి చేసిన నీరంటూ బోరు బావుల్లోని నీటిని సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నీటిని నామ మాత్రంగా శుద్ధి చేసి బాటిళ్లలో నింపుతూ ఆటోల ద్వారా ఇంటింటికీ సరఫరా చేస్తున్నారు.  అమాయక ప్రజలు శుద్ధమైన నీరనుకుని నమ్మి కలుషిత నీటిని తాగుతూ అనారోగ్యాల పాలవుతున్నారు.పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో నెలకొల్పిన వాటర్‌ప్లాంట్లలో చాలా వరకు  అనుమతులు లేనివే ఉన్నాయి. జహీరాబాద్‌ ప్రాంతంలో ఎన్ని వాటర్‌ ప్లాంట్లున్నాయో కూడా అధికారుల వద్ద సమాచారం లేదు. ముఖ్యంగా వీటిపై పర్యవేక్షణ పూర్తిగా కరువైందని,  వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపనలున్నాయి. అధికారులు తనిఖీలు చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.పట్టణంలో మినరల్‌ వాటర్‌  దందా జోరుగా కొనసాగుతుంది. ప్రతి ఇంట్లో ప్రస్తుతం మినరల్‌ వాటర్‌ను తాగేందుకు ఇష్టపడుతున్నారు. అయితే దీని ఆసరాగా చేసుకొని నీటి ప్లాంట్ల యాజమనులు మినరల్‌ చేయకుండనే  మినరల్‌ నీరుగా నమ్మించి విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలి 

Related Posts