YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ముఖ్యమంత్రి జగన్ కు డెడ్ లైన్ విధించిన సొంత పార్టీ ఎమ్మెల్యే 

ముఖ్యమంత్రి జగన్ కు డెడ్ లైన్ విధించిన సొంత పార్టీ ఎమ్మెల్యే 

ముఖ్యమంత్రి జగన్ కు డెడ్ లైన్ విధించిన సొంత పార్టీ ఎమ్మెల్యే 
విజయవాడ మార్చ్ 2 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సొంత పార్టీ ఎమ్మెల్యే డెడ్ లైన్ విధించి సంచలనం సృస్టించారు. తన తండ్రి వైఎస్సార్ మాదిరిగా పార్టీలో  ఎవరూ జగన్ ను పల్లెత్తు మాట్లాడని పరిస్థితుల్లో సొంత పార్టీ ఎమ్మెల్యేనే జగన్ కు ఓ విషయంలో డెడ్ లైన్ విధించాడు. ఆ డెడ్ లైన్ లోపు తాను చెప్పిన పని చేయకపోతే ఎమ్మెల్యే పదవికి  రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశాడు. ఆయనే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా. సొంత ప్రభుత్వానికి ఆల్టిమేటం ఇచ్చారు.పౌరసత్వ  సవరణ చట్టం జాతీయ జనాభా రిజిస్టర్ కార్యక్రమాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఈ సమయంలో రాష్ట్రంలో కూడా అమలు చేయవద్దని కోరుతూ అసెంబ్లీలో  తీర్మానం చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్తఫా డిమాండ్ చేశారు. త్వరలో నిర్వహించనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దానికి సంబంధించి తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించాలని  కోరారు. అలా చేయకపోతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తన నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన మైనారిటీల సింహగర్జన బహిరంగ సభలో ఈ ప్రకటన చేశారు.ఈ  సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడుతూ.. భారత్లో నివసించే ముస్లింల మనుగడను ప్రశ్నార్థకం చేసేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. మతాల వారీగా  ప్రజలను విడగొట్టే ఇలాంటి చట్టాలను తమ రాష్ట్రం లో అమలు చేయకూడదని ముస్లింల మనోభావాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వివాదాస్పద చట్టాలను  రాష్ట్రంలో అమలు చేయరని స్పష్టం చేశారు. ఈ విషయంలో తనకు నమ్మకం ఉందని పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టం జాతీయ జనాభా రిజిస్టర్ కార్యక్రమాలకు తమ ప్రభుత్వం  వ్యతిరేకమని తేల్చిచెప్పారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఢీకొట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.ఈ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీ లో తీర్మానం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను  ఒప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గతంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కూడా ఇవే వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. సొంత పార్టీ  ఎమ్మెల్యే డెడ్ లైన్ విధించడంతో అధికార పార్టీ వర్గాలు ఖంగుతిన్నాయి. పార్టీలో ఎవరు జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడారు. అలాంటిది ఎమ్మెల్యే మాట్లడడంతో భవిష్యత్ లో ఆయన పై చర్యలు  తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

Related Posts