YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

 4నుండి ఇంటర్మీడియట్‌ పరీక్షలు

 4నుండి ఇంటర్మీడియట్‌ పరీక్షలు

 4నుండి ఇంటర్మీడియట్‌ పరీక్షలు
ఒక్క నిమిషం ఆలస్యం అయినా అనుమతించం:ఇంటర్‌ బోర్డు
హైదరాబాద్‌ మార్చ్ 2 
రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు మార్చి 4వ తేదీ  నుంచి ప్రారంభంకానున్నాయి. ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్షా హాల్లోకి అనుమతించమని ఇంటర్‌ బోర్డు అధికారులు చెప్పారు. విద్యార్థులు 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఇంటర్‌ విద్యార్థుల కోసం అదనపు బస్సు సర్వీస్‌లు నడుపుతున్నామని వివరించారు. విద్యార్ధులను నేలమీద  కూర్చోబెడితే ఆ కళాశాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ తెలిపారు. ఉదయం 9  గంటల నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని చెప్పారు. 'పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్‌ పరికరాలకు అనుమతి లేదు. ఎగ్జామ్‌ సెంటర్‌ లొకేటర్‌ యాప్‌ ద్వారా పరీక్షా కేంద్రాన్ని గుర్తించొచ్చు' అని  రామచంద్రన్‌ వివరించారు.   ఇంటర్‌బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి  విద్యార్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకొనే సదుపాయాన్ని బోర్డు అధికారులు కల్పించారు.

Related Posts