YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అధికారులను అడ్డుకున్న గుడిసేవాసులు

అధికారులను అడ్డుకున్న గుడిసేవాసులు

అధికారులను అడ్డుకున్న గుడిసేవాసులు
అనంతపురం మార్చ్ 2
నిరుపేదలు నివసిస్తున్న గుడిసెలను అధికారులు ద్వంసం చేయడంతో ఈ ప్రభుత్వం  పేదలకు అన్యాయం చేస్తున్నారు అంటూ  రఫీ అనే యువకుడు కిరోసిన్ పోసుకొని పోలీసులు రెవెన్యూ అధికారులు ముందే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.బుక్కరాయసముద్రం దేవరకొండ వద్ద సర్వేనెంబర్ 356 లో సిపిఐ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలుగా నిరుపేదలకు... గుడిసెలు వేయించడం జరిగింది.గత ఏడాది డిసెంబర్ 27న గుడిసెలను పోలీసులు రెవెన్యూ అధికారులు జెసిబి అంతరాలతో పోలీసు బలగాలతో తొలగించడం జరిగింది. ఈ విషయంపై  సిపిఐ ఆధ్వర్యంలో పలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.  అక్కడ వేసుకున్న పట్టాలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.అయితే రెవెన్యూ అధికారులు అక్కడ తొలగించిన బాధితులకు ఇంటి పట్టాలు ఇస్తామని ఇస్తామని  హామీ ఇచ్చారని స్థానికులు అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పండుగ సందర్భంగా ఇంటి పట్టాలు ఇస్తామని ఆ జాబితాలో రెవెన్యూ అధికారులు మండల తాసిల్దార్ మహుబా  భాష హామీ ఇచ్చారు. అయితే ఇంటి పట్టాలు జాబితాలో తమ పేర్లు లేవని పేదలు అందోళన నిర్వహించారు. అధికారులను అడ్డుకున్నారు.  ఆత్మహత్యకు పాల్పడిన రఫీ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. 

Related Posts