పందుల కళేబరాలతో కల్తీనూనె తయారు
హైదరాబాద్ మార్చ్ 2
కల్తీ నూనె తయారీపై ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న అక్రమ తయారీదారులు వివిధ మార్గాల్లో తమ అక్రమ కల్తీ నూనె తయారీని కొనసాగిస్తున్నారు. కాసుల సంపాదన కోసం ప్రజల ఆరోగ్యంతో అక్రమార్కులు చెలగాటమాడుతున్నారు. హైదరాబాద్ శివారు కొత్తూరులో జంతు కళేబరాలతో కల్తీ నూనెను తయారు చేస్తున్నారన్న సమాచారాన్ని అందుకున్న పోలీసులు దాడి చేసి ఓ ముఠాను పట్టుకున్నట్లు తెలిసింది. తయారీ కేంద్రం నుంచి దుర్వాసన రావడంతో విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. పందుల కళేబరాలతో కల్తీనూనె తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తిమ్మాపూర్ లోని హరి ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో జంతు కళేబరాలు, చనిపోయిన పందులు వాటి కళేబరాలతో కల్తీ నూనె తయారీ చేస్తుండగా దుర్వాసన భరించలేక స్థానికులు పరిశ్రమలోకి వెళ్లి వాళ్ళ బండారం బయట పెట్టారు.