YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 ఈనెల  12న డీజీపీ గౌతమ్ సవాంగ్ కోర్టుకు  విశాఖలో చంద్రబాబును అడ్డుకోవడంపై హైకోర్టు విచారణ 

 ఈనెల  12న డీజీపీ గౌతమ్ సవాంగ్ కోర్టుకు  విశాఖలో చంద్రబాబును అడ్డుకోవడంపై హైకోర్టు విచారణ 

 ఈనెల  12న డీజీపీ గౌతమ్ సవాంగ్ కోర్టుకు 
విశాఖలో చంద్రబాబును అడ్డుకోవడంపై హైకోర్టు విచారణ 
 తదుపరి విచారణ ఈనెల 12కు వాయిదా
అమరావతి మార్చ్ 2 
ప్రజాచైతన్య యాత్రలో భాగంగా ఫిబ్రవరి 27న విశాఖలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడంపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ పిటిషన్పై  విచారణ జరిగింది. దీనికి సంబంధించి న్యాయవాది కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈనెల 12న డీజీపీ గౌతమ్ సవాంగ్ కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించిందన్నారు. సెక్షన్ సీఆర్పీసీ  151పై డీజీపీ వివరణ ఇవ్వాలని హైకోర్టు పేర్కొంటూ తదుపరి విచారణ ఈనెల 12కు వాయిదా చేసిందన్నారు. అధికార పార్టీకి చెందిన వందలమంది కార్యకర్తలు వచ్చి చంద్రబాబుపై చెప్పులు,  కోడిగుడ్లతో దాడి చేస్తే పోలీసులు వారిని కంట్రోల్ చేయకుండా అనుమతి తీసుకుని పర్యటనకు వచ్చిన చంద్రబాబును 151 సెక్షన్ కింద ఎందుకు అదుపులోకి తీసుకున్నారంటూ  పోలీసులతీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసిందని కృష్ణారెడ్డి తెలిపారు.

Related Posts