YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో బీసీ రిజర్వేషన్ల జీవో రద్దు

ఏపీలో బీసీ రిజర్వేషన్ల జీవో రద్దు

ఏపీలో బీసీ రిజర్వేషన్ల జీవో రద్దు
విజయవాడ, మార్చ్ 2
ఏపీ హైకోర్టు జగన్ సర్కార్‌కు షాకిచ్చింది. ఏపీ పంచాయతీ ఎన్నికల్లో 59.85శాతం రిజర్వేషన్ల జీవోను సస్పెండ్ చేసింది. 50శాతం మించకుండా రిజర్వేషన్లు ఉండాలన్న హైకోర్టు.. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ను గుర్తు చేసింది. రిజర్వేషన్లు 50శాతం మించడం సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధమన్న వ్యాఖ్యానించింది. 50శాతం మించకుండా రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించింది. నెలలోగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని సూచించింది. ఏపీ హైకోర్టులో స్థానిక సంస్థల్లో 59శాతం రిజర్వేషన్ల పై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది. రిజర్వేషన్లు 50శాతం దాటడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. దీనిపై కొద్దిరోజులుగా కోర్టు విచారణ జరిపి తీర్పును వెల్లడించింది. కోర్టు మళ్లీ రిజర్వేషన్లు ఖరారు చేయమనడంతో స్థానిక సంస్థలు ఆలస్యం కానున్నాయి. కనీసం మరో రెండు నెలల సమయం అయినా పట్టే అవకాశం ఉంది.వాస్తవానికి మార్చిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కానీ రిజర్వేషన్ల అంశంపై కోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించింది. చివరికి జీవోను హైకోర్టు కొట్టేయడం ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళుతుందా.. లేక హైకోర్టు మార్గదర్శకాల మేరకు మళ్లీ రిజర్వేషన్లు ఖరారు చేస్తుందా అన్నది చూడాలి.

Related Posts