YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌‌ను పోలీసులు అరెస్ట్

మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌‌ను పోలీసులు అరెస్ట్

మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌‌ను పోలీసులు అరెస్ట్
శ్రీకాకుళం, మార్చ్ 2
టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగిని అసభ్య పదజాలంతో దూషించిన కేసులో రవికుమార్‌పై 353, 306, రెడ్‌ విత్‌ చ 109 సెక్షన్ల కింద పోలీసులు కేసు ఫైల్ చేశారు. సోమవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళను దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి ఇన్‌ఛార్జ్‌ ఈఓపీఆర్‌డీ గూపపు అప్పలనాయుడును కూన రవికుమార్ బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. అధికారిని కూన బూతులు తిట్టగా.. ఆ ఆడియో టేప్ వైరల్ అయ్యింది. తన అనుచరుడికి సంబంధించిన సమస్యపై అప్పలనాయుడికి కూన ఫోన్ చేశారు. డబ్బులకు సంబంధించిన అంశంపై మాట్లాడారు. తాను ఫోన్‌ను ఎందకు తీయలేదని బూతు పురాణం అందుకున్నారు. పాతి పెడతాను అంటూ బెదిరింపులకు దిగారు. దీనిపై ఈఓపీఆర్‌డీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే తనపై కుట్ర జరుగుతోందని.. ఉద్దేశపూర్వకంగానే కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.కూన రవికుమార్ తన దూకుడుతో గతంలోనూ నోరు జారారు. గతంలో ఈఓపీఆర్‌డీ పీవీ మురళిమోహన్‌, సరుబుజ్జిలి ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శిని తిట్టారనే ఆరోపణలు వచ్చాయి. అప్పుడు కూడా కేసులు నమోదు కాగా.. కొద్దిరోజులు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తర్వాత బెయిల్ రావడంతో బయటకు వచ్చారు. మళ్లీ ఆడియో టేపుతో అడ్డంగా దొరికిపోయారు.

Related Posts