YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

మళ్లీ మలేషియా, భారత్ మధ్య సంబంధాలు

మళ్లీ మలేషియా, భారత్ మధ్య సంబంధాలు

మళ్లీ మలేషియా, భారత్ మధ్య సంబంధాలు
న్యూఢిల్లీ, మార్చ్ 2
మహతీర్ మొహమూద్ హయాంలో దెబ్బతిన్న మలేసియా, భారత్ వాణిజ్య సంబంధాలను పునరుద్దరించేందుకు ఇరు దేశాలూ ప్రయత్నిస్తున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గతవారమే ప్రధాని పదవికి మహతీర్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సంకీర్ణ ప్రభుత్వంలో విబేధాల కారణంతో మహతీర్ ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. అయితే, ఆర్టికల్ 370 రద్దు, సీఏఏ లాంటి భారత అంతర్గత వ్యవహారాలపై మహతీర్ అతిగా స్పందించడం కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో మలేసియాతో వాణిజ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపాయి.ప్రపంచంలోనే అత్యధికంగా పామాయిల్‌ను దిగుమతి చేసుకునే భారత్.. మహతీర్ వ్యాఖ్యలతో ఆ దేశం నుంచి వాటి దిగుమతులను తగ్గించింది. ఇండోనేషియా నుంచి దిగుమతులు పెరగడంతో మలేసియాలోని పామాయిల్ ఉత్పత్తిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ దేశం నుంచి పామాయిల్ ఉత్పత్తులను భారత్ నిషేధించడంతో పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని వీ కా సియాంగ్ అనే ప్రజా ప్రతినిధి వ్యాఖ్యానించారు. దేశం కోసం, మన ప్రజల కోసం వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించగలమా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ఈ వ్యవహారంపై కొత్త ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని, భారత్‌తో స్నేహం కొనసాగుతుందని అన్నారు.భారత అంతర్గత విషయాల్లో మలేసియా జోక్యం చేసుకోకుండా ఉంటే ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు మెరుపరుచుకోడానికి సిద్ధంగా ఉందని ఓ ఉన్నతాధికారి అన్నారు. మలేసియా కొత్త ప్రధాని ముహయిద్దీన్ యాసిన్‌ను భారత్ ఆహ్వానించనుందని పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ అధికారి తెలిపారు. జనవరి 8 తర్వాత మలేసియా నుంచి పామాయిల్ ఉత్పత్తులపై నిషేధం కొనసాగుతోంది. ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టంపై మహతీర్ చేసిన విమర్శలతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.జనవరిలో మలేసియా నుంచి దిగుమతులు 85 శాతం తగ్గిపోయి 2011 నాటి కనిష్టానికి చేరాయి. గతేడాది మలేసియా మొత్తం పామాయిల్ ఎగుమతుల్లో దాదాపు నాలుగింట ఒక వంతు భారతదేశం దిగుమతి చేసుకుంది. ఐదేళ్లుగా మలేసియా నుంచి పామాయిల్‌ను అత్యధికంగా కొనుగోలు చేసింది. మలేసియా పామాయిల్ ఉత్పత్తులపై నిషేధం విధించిన భారత్.. ఆ లోటును ఇండోనేషియాతో భర్తీ చేస్తోంది.

Related Posts