.ఓడిపోయిన ఇండియానే టాప్
ముంబై, మార్చ్ 2
న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో 0-2తో భారత్ వైట్‌వాష్‌కు గురైన సంగతి తెలిసిందే. అన్ని విభాగాల్లో ఆధిపత్యం కనబర్చిన కివీస్..రెండు టెస్టులను కలిపి కేవలం ఏడు రోజుల్లోనే తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ సిరీస్‌లో ఘోరంగా ఓడిపోయినప్పటికీ, ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో పెద్దగ ఫరక్ పడలేదు. ఇప్పటికీ 360 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. రెండోస్థానంలో ఆస్ట్రేలియా (296 పాయింట్లు)కు భారత్‌కు మధ్య 64 పాయింట్ల భారీ తేడా ఉండటం విశేషం.ఇక ఈ సిరీస్ ద్వారా భారీగా న్యూజిలాండ్ లాభపడిందని చెప్పుకోవచ్చు. రెండు టెస్టులను గెలుపొందడంతో ఏకంగా 120 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. దీంతో 180 పాయింట్లతో, ఇంగ్లాండ్‌ను వెనక్కినెట్టి మూడో స్థానాన్ని ఆక్రమించింది. ఇంగ్లాండ్ ఖాతాలో146 పాయింట్లు ఉన్నాయి.మరోవైపు ఈనెల 12 నుంచి దక్షిణాఫ్రికాతో భారత్ మూడు వన్డేల సిరీస్ ఆడుతుంది. అనంతరం ఐపీఎల్, ఆసియాకప్, టీ20 ప్రపంచకప్ వరకూ టీమిండియా వైట్‌బాల్ క్రికెట్‌నే ఎక్కువగా ఆడుతుంది. ఈ ఏడాది చివరిలో ఆసీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్, ఇంగ్లాండ్‌తో సొంతగడ్డపై ఐదు టెస్టుల సిరీస్ ప్రస్తుతానికి ఖరారైయ్యాయి.