YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్ర‌ధాని మోదీ రాజీనామా చేయాలి: విప‌క్ష స‌భ్యుల డిమాండ్

ప్ర‌ధాని మోదీ రాజీనామా చేయాలి: విప‌క్ష స‌భ్యుల డిమాండ్

ప్ర‌ధాని మోదీ రాజీనామా చేయాలి: విప‌క్ష స‌భ్యుల డిమాండ్
న్యూ డిల్లీ, మార్చ్ 2
ఢిల్లీ అల్ల‌ర్ల‌పై ఇవాళ పార్ల‌మెంట్‌లో దుమారం చెల‌రేగింది.  ప్ర‌ధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా .. త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాల‌ని ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేశాయి.  విప‌క్ష స‌భ్యుల ఆందోళ‌న న‌డుమ‌.. ఉభ‌య‌స‌భ‌ల‌ను రేప‌టికి వాయిదా వేశారు. ఉద‌యం ప్రారంభ‌మైన రెండు స‌భ‌లు.. విప‌క్షాల నిర‌స‌న‌ల‌తో హోరెత్తాయి. ఆ త‌ర్వాత స‌భ‌ల‌ను మ‌ధ్యాహ్నానికి వాయిదా వేశారు. అయితే 2 గంట‌ల‌కు స‌మావేశ‌మైన ఉభ‌య‌స‌భ‌ల్లో మ‌ళ్లీ అదే సీన్ రిపీటైంది. దీంతో స‌భ‌ల‌ను రేప‌టికి వాయిదా వేశారు. లోక్‌స‌భ‌లో విప‌క్షాలు.. ప్ర‌ధాని మోదీ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేసే స‌మ‌యంలో స్పీక‌ర్ ఓం బిర్లా వారిని అడ్డుకున్నారు.  ఢిల్లీ అల్ల‌ర్ల‌పై చ‌ర్చ చేప‌ట్ట‌లేమ‌న్నారు.  ఇది చ‌ర్చ‌ల‌కు అనువైన స‌మ‌యం కాద‌న్నారు.   ప‌రిస్థితి మెరుగుప‌డ్డాక‌, చ‌ర్చ‌లు చేప‌డుతామ‌ని బిర్లా అన్నారు. రాజ్య‌స‌భ‌లోనూ కాంగ్రెస్‌, లెఫ్ట్‌, టీఎంసీ, ఎస్పీ, బీఎస్పీ, డీఎంకే స‌భ్యులు నినాదాల‌తో హోరెత్తించారు.  దీంతో చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు స‌భ‌ను రేప‌టికి వాయిదా వేశారు.  ఢిల్లీలో హింస చెల‌రేగుతుంటే.. ప్ర‌భుత్వం మూడు రోజుల పాటు నిద్ర‌పోయింద‌ని విప‌క్ష‌నేత గులాం న‌బీ ఆజాద్ అన్నారు. ఢిల్లీ ఈజ్ బ‌ర్నింగ్ అంటూ కొంత మంది స‌భ్యులు నినాదాలు చేశారు.  టీఎంసీ స‌భ్యులు త‌మ కండ్ల‌కు న‌ల్ల‌బ్యాడ్జీలు ధ‌రించిన ప్ర‌ద‌ర్శ‌న‌లో పాల్గొన్నారు. న‌ల్ల‌బ్యాడీలు ధ‌రించిన స‌భ‌కు రావ‌ద్దు అంటూ వెంకయ్య వారిని ఆదేశించారు.  అయినా విప‌క్ష స‌భ్యులు విన‌లేదు. దీంతో స‌భ‌ను వాయిదా వేశారు. ఢిల్లీ అల్ల‌ర్ల‌లో మృతిచెందిన వారి సంఖ్య 46కు చేరుకున్న‌ది. 

Related Posts