YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

 ఒక్కరికే కరోనా పాజిటివ్ : జవహర్ రెడ్డి

 ఒక్కరికే కరోనా పాజిటివ్ : జవహర్ రెడ్డి

 ఒక్కరికే కరోనా పాజిటివ్ : జవహర్ రెడ్డి
విజయవాడ, మార్చి 3, 
ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క కరోనా వైరస్ కేసు కూడా నమోదు కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.విదేశాల నుంచి రాష్ట్రానికొచ్చే ప్రయాణికులపై నిరంతర నిఘా పెట్టామని, 24 గంటలు అందుబాటులో ఉండే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైందని వెల్లడించారు. విమానాశ్రయాలు, నౌకాశ్రయాల్లో ప్రయాణికులకు పూర్తి స్థాయిలో స్క్రీనింగ్ నిర్వహిస్తున్నామని జవహర్‌రెడ్డి తెలిపారు. కోవిడ్ ప్రభావిత దేశాల నుంచి ఇప్పటి వరకు 263 మంది ప్రయాణికులు రాష్ట్రానికి వచ్చారని, వారందరినీ పరిశీలనలో ఉంచినట్లు వెల్లడించారు. అందులో 50 మంది వారి ఇళ్లల్లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు వివరించారు. 211 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయిందని పేర్కొన్నారు.అనుమానంగా ఉన్న 11 మంది శాంపిళ్లను ల్యాబ్‌కు పంపగా 10 మందికి నెగెటివ్‌ అని తేలిందని జవహర్‌రెడ్డి వెల్లడించారు. అయితే ఒకరికి సంబంధించిన శాంపిల్‌ రిపోర్టు మాత్రం రావాల్సి ఉందన్నారు. కాగా, తెలంగాణలో సోమవారం తొలి కరోనా కేసు నమోదైన సంగతి తెలిసిందే. దేశం మొత్తం మీద ఇప్పటి వరకు రెండు కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Related Posts