YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ విదేశీయం

వామ్మో... ఫారిన్ సంబంధాలు

వామ్మో... ఫారిన్ సంబంధాలు

వామ్మో... ఫారిన్ సంబంధాలు
శాడిస్ట్ మొగుళ్లతో నరకం..
హైద్రాబాద్, మార్చి 3
ఇండియాలో కంటే అమెరికా సంబంధమైతే తమ గారాలపట్టి మరింత సుఖంగా ఉంటుదని భావిస్తుంటారు. తమ అల్లుడు డాలర్లలో సంపాధిస్తాడు... అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోదం చేస్తాడని చెప్పుకోవడంలో ఆ స్టాటసే వేరు అనుకుంటుంటారు. అయితే... అమెరికా అల్లుళ్లలోనూ షాడిస్టులున్నారని తాజా గణాంకాలు నిరూపిస్తున్నాయి. అల్లుళ్ల వేధింపులపై తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 574 కేసులు ఎన్నారై భర్తలు, వారి బంధువులపైన కేసులు నమోదయ్యాయి. వీటిలో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన 17 మహిళా పోలీస్ స్టేషన్ల లోనే 417 కేసులు అయ్యాయి. జూలై 17 న ఏర్పాటైన ప్రత్యేక ఎన్నారై సెల్ కు 73 పిటీషన్ లు వచ్చాయి. వివాహ, గృహ హింస, ఇతర వేధింపులపై ఎన్నారై నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ వచ్చిన ఈ పిటీషన్లలో 70 వాటిపై కేసులను రిజిస్టర్ చేశారు.ఈ 70 కేసుల్లో 29 కేసులు దార్యాప్తు దశలో ఉండగా, 41 కేసులు పెండింగ్ ట్రయల్స్ లో వున్నాయి. 46 మందికి లుక్ అవుట్ నోటీసులు, మరో 32 మందికి నాన్ బెయిలబుల్ వారెంట్ లు. ఐదుగురికి ఎల్.ఒ.సిలు అమలయ్యాయి కూడా... మరో ఆరుగురి నుంచి ఏకంగా పాస్ పోర్ట్ లను స్వాధీనం చేసుకున్నారు.ఇక... ఈ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ సిటీ మహిళా సీసీఎస్ పోలీసు స్టేషన్ లో 137 కేసులుతో మొదటి స్థానంలో ఉండగా... 78 కేసులతో సరూర్ నగర్ మహిళా పీ.ఎస్ ద్వితీయ స్థానంలో ఉంది. ఇక... సౌత్ జోన్ మహిళా పోలీస్ స్టేషన్ లో 65 , బేగంపేట్ మహిళా స్టేషన్ లో 34 ,భువనగిరి మహిళా స్టేషన్ లో ఒకటి, గచ్చిబౌలి మహిళా స్టేషన్ లో 8 , వరంగల్ పోలీస్ కమిషనరేట్ లోని సుబేదారి, వరంగల్ అర్బన్ మహిళా స్టేషన్ లలో 42 , ఖమ్మం లో ఏడు, మహబూబ్ నగర్ లో ఆరు, ఆదిలాబాద్ లో 11 , కరీంనగర్ మహిళా స్టేషన్ లో 21, నల్గొండ స్టేషన్ లో ఏడు కోసులు నమోదయ్యాయి.ప్రవాస భారతీయుల కేసులకు సంబంధించి ప్రధానంగా ఎన్నారై పెళ్లిళ్లకు సంబంధించి దర్యాప్తు అధికారులకు(ఐ.ఓ) సహాయపడేలా నెట్వర్క్ ఆఫ్ ఇంటర్నేషనల్ లీగల్ ఆక్టివిస్ట్ (నీల), ఇతర స్వచ్ఛంద సంస్థల సహాయ సహకారాలను అందిస్తున్నాయి. ముఖ్యంగా వరకట్న వేధింపులు, ఎన్నారై వివాహాల మోసాలు,బంధువుల వేధింపుల విషయం లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు సహాయ పడేలా ఈ సెల్ తోడ్పడుతుంది. ఈ కేసులలో దర్యాప్తు చేసే విధానం పై ఎస్.హెచ్.ఓ లకు శిక్షణ అందిస్తోంది. ఈఎన్నారై సెల్ ఎప్పటి కప్పుడు లుక్అవుట్ నోటీసులు, నాన్ బెయిలబుల్ కేసులు, ఛార్జ్ షీట్ ల దాఖలు, దర్యాప్తు వేగవంతం పై నిరంతరం విచారణాధికారులతో పర్యవేక్షిస్తోంది. వివిధ దేశాల ఎంబసీలు, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, జాతీయ మహిళా కమీషన్, ఎన్నారై వివాహాల పై పనిచేసే స్వచ్చంద సంస్థల కాంటాక్ట్ నెంబర్లను బాధితులకు అంద చేస్తుంది.ఎన్నారై సెల్ ప్రారంభించిన ఆరు నెలల్లోనే ఐదు కేసులకు సంబంధించి లుక్ అవుట్ నోటీసులు అమలు చేయడం తో పాటు ఆరు కేసులకు సంబంధించి పాస్ పోర్ట్ లను ఇంపౌండ్ చేసింది. ఈ సెల్ ప్రధానంగా జాతీయ మహిళా కమీషన్, కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ, ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారి, కాన్సిలేట్ జనరల్, ఎంబసీలు, తెలంగాణా ప్రభుత్వ ఎన్ఆర్ఐ సెల్, జీఏడీ ల సహాయం, సమన్వయము తో కేసుల సత్వర విచారణను చెపట్టేందుకై సాంకేతిక సహకారాన్ని విచారణాధికారులకు అందచేస్తోంది.ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఈ సంఖ్యలో కేసులు నమోదయితే... పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల పరిస్థితులు కూడా ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.కాబట్టి... అమెరికా, ఫారెన్ సంబంధాలు అనగానే ఏం చూసుకోకుండా పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడం సరి కాదని నిపుణులు సూచిస్తున్నారు. అబ్బాయి, వారి కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే పెళ్లి సంబంధం విషయంలో ముందడుగు వేయాలని హెచ్చరిస్తున్నారు.

Related Posts