YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సీజనల్ లీడర్ గా మారిపోతున్న జనసేనాని

సీజనల్ లీడర్ గా మారిపోతున్న జనసేనాని

సీజనల్ లీడర్ గా మారిపోతున్న జనసేనాని
గుంటూరు, మార్చి 3
జనసేన ప్రస్థానం ఎటు వైపు? క్యాడర్ అసలు ఉందా? పవన్ వచ్చి చేస్తే అది కార్యక్రమం లేకుంటే లేనట్లేనా? అవును జనసేన అప్పుడూ ఇప్పుడూ వన్ మ్యాన్ షోగానే ఉంది. క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు. పైగా బీజేపీతో కలసిన తర్వాత జనసేన పూర్తిగా డీలా పడిందనే చెప్పాలి. ఒక్క కార్యక్రమం చేస్తే ఒట్టు. పవన్ కల్యాణ్ సీజనల్ లీడర్ గా మారిపోయారు. సినిమాల్లో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ ఎప్పుడో వచ్చి అలా ఎవరెవరికో హామీ ఇచ్చి వెళ్లిపోతుండటం జనసైనికులను కూడా కలచి వేస్తుంది.ఏ పార్టీ అయినా నిలదొక్కుకోవాలంటే మంచి నాయకత్వం అవసరం. అయితే పవన్ కల్యాణ్ పూర్తిగా తన గ్లామర్ పైనే ఆధారపడి పార్టీని నడుపుతున్నారు. సామాజిక వర్గం బలం, అభిమానుల అండదండలు  ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ పార్టీని సరైన దిశలో నడపలేకపోతున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినప్పుడు పవన్ కల్యాణ్ బలాన్ని ఎంతగానో  ఊహించుకున్నారు. కానీ చేజేతులా తన బలాన్ని తానే బయటపెట్టుకున్నారు. దీంతో ఇక జనసేన ఏపీలో కోలుకోలేని పరిస్థితికి వచ్చేసిందనే చెప్పాలి.ఇరవై ఐదేళ్ల భవిష్యత్ రాజకీయంతోనే  తాను పార్టీని స్థాపించానని పవన్ కల్యాణ్ మాటలను ఎవరు పట్టించుకుంటారు? అంత ఓపిక ఎవరికి ఉంది? నాలుగేళ్లు పార్టీని నడపలేక బీజేపీతో చేయి కలిపారన్న అపవాదును  మూటగట్టుకున్నారు. పవన్ కు కొద్దోగొప్పో మిత్రులుగా ఉన్న కమ్యునిస్టులు సయితం ఇప్పడు దూరమయ్యారు. ఏదైనా తన చేతుల మీదుగానే జరగాలనుకోవడమే పార్టీకి ముప్పు తెచ్చిపెట్టిందనే చెప్పాలి. మూడో ప్రత్యామ్నాయానికి ఏపీలో అవకాశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ దానిని వినియోగించుకోలేక పోయారు.పవన్ కల్యాణ్ తొలినుంచి తప్పుటడుగులే  వేస్తున్నారు. నాడు టీడీపీతో అనుబంధాన్ని పెంచుకున్నా, నేడు బీజేపీతో సంబంధాన్ని పెట్టుకున్నా అది రాజకీయ తప్పిదమే. ఒంటరిగా ఏపీలో బలంగా ఎదగాల్సిన పార్టీని చేజేతులా స్ట్రెచర్  పై పడుకోబెట్టారు. ఇప్పుడు బీజేపీ చెప్పినట్లే పవన్ కల్యాణ‌్ చేయాల్సి ఉంటుంది. అందుకే గత నెల రోజులుగా కార్యక్రమాలు లేవు. బీజేపీతో కలసి చేయాలంటే అందుకు కొన్ని అడ్డంకులు  ఉంటాయి. ఇవన్నీ పవన్ కల్యాణ్ కు అర్థమయ్యే సరికి పుణ్యకాలం ముగిసిపోతుంది. మొత్తం మీద పవన్ కల్యాణ్ గ్లామర్ తో పార్టీని నడుపుదామనుకుంటే కుదరదన్న విషయాన్ని ఇప్పటికైనా గ్రహించాలి. నిత్యం ప్రజల్లో ఉండి వారి సమస్యలపై స్పందిస్తుంటేనే బలమైన పార్టీగా జనసేనను మార్చగలరు. లేకుంటే ఆ పార్టీని ఏపీలో ఇక మర్చిపోవాల్సి ఉంటుంది.

Related Posts