YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 గాలేరు రివర్స్ టెండరింగ్ తో 60 కోట్ల ఆదా

 గాలేరు రివర్స్ టెండరింగ్ తో 60 కోట్ల ఆదా

 గాలేరు రివర్స్ టెండరింగ్ తో 60 కోట్ల ఆదా
కడప, మార్చి 3
గాలేరు-నగరి 2వ దశ పనుల రివర్స్ టెండరింగ్ వల్ల ప్రభుత్వానికి రూ.60.14 కోట్ల మేరకు ఆదా అయినట్టయింది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఖరారు చేసిన, 25 శాతానికి మించకుండా చేసిన కాంట్రాక్టు పనులను వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రద్దు చేసిన విషయం విదితమే. కడప జిల్లాలో ఎన్నికలకు ముందు హడావుడిగా టెండర్లు పిలిచి ఖరారు చేసిన భారీ కాంట్రాక్టులను రద్దు చేశారు. భారీ ప్రాజెక్టులైన గాలేరు- నగరి, తెలుగుగంగ పనులు ఈ కోవలో రద్దయిపోయాయి. గత ప్రభుత్వం అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న రాజ్యసభసభ్యుడు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ కంపెనీకి ఈకాంట్రాక్టులను కట్టబెట్టింది. ఇతర కంపెనీలను బెదిరించి, అనర్హులుగా తేల్చి రిత్విక్ కంపెనీకి కట్టబెట్టారనే విమర్శలు అప్పట్లోనే వినిపించాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా 3.64 శాతం ఎక్కువకు రిత్విక్ కంపెనీ ఈ పనులను దక్కించుకుంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రద్దుచేసిన ఈ పనులను తిరిగి టెండర్లు పిలిచేందుకు నిర్ణయించారు. ప్రక్రియ పూర్తిచేసి ఇటీవలే టెండర్లు పిలిచారు. న్యాయ కమిటీ ఖరారు చేసిన ధరతో గాలేరు-నగరి 2వ దశకు చెందిన ప్యాకేజీ -1, ప్యాకేజి-2పనులకు రీ టెండర్లు ఆహ్వానించారు. ఈ రెండు పనులకు రూ.735.10 కోట్లకు ప్రభుత్వం టెండర్లు పిలవగా, 5.04 శాతం తక్కువకు కాంట్రాక్టర్లు కోడ్ చేశారు.రివర్స్ టెండర్ల వల్ల గాలేరు-నగరి 2వ దశ పనుల్లో ప్రభుత్వానికి రూ.60.14 కోట్లు ఆదా అయ్యింది. ప్యాకేజీ-1 పనులను రూ. 391.13 కోట్ల అంచనాతో ప్రభుత్వం టెండర్లు పిలవగా, ఎంఆర్‌కేఆర్, పీఎల్‌ఆర్, గాయత్రి తదితర కంపెనీలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని ఈ-వేలంలో టెండర్లలో పాల్గొన్నాయి. 5.04 శాతం తక్కువగా కోడ్ చేసిన పీఎల్‌ఆర్ కంపెనీ ఈ పనులను దక్కించుకుంది. పీఎల్‌ఆర్ కంపెనీ రూ.371.42కోట్లతో ఈ పనులను దక్కించుకుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవే పనులకు రూ.406.74 కోట్ల అంచనాతో టెండర్లు పిలవగా, సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ కంపెనీ 3.64 శాతం ఎక్కువతో వీటిని దక్కించుకుంది. అధిక రేట్లు నమోదు చేసి టెండరు దక్కించుకోవడంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే స్వయంగా కలగచేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఇవే పనులను పీఎల్‌ఆర్ కంపెనీ 5.04 శాతం తక్కువతో పొందింది. గత ప్రభుత్వం ఖరారుచేసిన మొత్తంతోప్రస్తుత ప్రభుత్వంలో పీఎల్‌ఆర్‌కు ఖరారైన మొత్తాన్ని పోలిస్తే ప్యాకేజి -1 పనుల్లో రూ. 35.31 కోట్ల ప్రజాధనం ఆదా అయ్యింది. ప్యాకేజి -2 పనులకు ప్రస్తుత ప్రభుత్వం రూ.343.97 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచింది. ఈ టెండర్లలో ఎంఆర్‌కేఆర్, హెచ్‌ఈఎస్ తదితర కంపెనీలు పోటీపడ్డాయి. ఆన్‌లైన్ విధానంలో ఏఆర్‌కేఆర్ కంపెనీ రూ.326.77 కోట్లతో ఈ పనులను దక్కించుకుంది. గత ప్రభుత్వంలో ఇవే పనులకు రూ. 351.60 కోట్ల అంచనాతో టెండర్లు పిలవగా సీఎం రమేష్ కంపెనీ 2.63 శాతం ఎక్కువగా నమోదుచేసి పనులను దక్కించుకుంది. గతంతో పోలిస్తే ప్యాకేజీ -2 పనుల్లో రూ.24,83 కోట్లు ఆదా అయింది. ప్యాకేజీ -1, ప్యాకేజి -2 రెండుపనుల్లో కలిసి రూ. 60.14కోట్ల ప్రజాధనం ఆదా  అయింది. పనులు దక్కించుకున్న పీఎల్‌ఆర్, ఎంఆర్‌కేఆర్ కంపెనీలకు అగ్రిమెంటు చేసిన తర్వాత పనులు ప్రారంభం కానున్నాయి. కాగా ప్యాకేజి -1కు సంబంధించి గాలేరు-నగరిలో 33వ కిలోమీటరు వద్ద (అడవి చెర్లోపల్లె గ్రామం) నుండి 66వ కిలోమీటరు (నందిమండలం గ్రామం) వరకు ప్రధానకాలువ తవ్వకాలు తదితర పనులు చేయాల్సి ఉంది. ప్యాకేజీ-2కు సంబంధించి 66వ కిలోమీటరు (నందిమండలం గ్రామం) నుండి, 96వ కిలోమీటరు (చింతకొమ్మదినె్న మండలం పొలతల రోడ్డు) వరకు పనులు చేయాల్సి ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం ఈ పనులను ఐదేళ్లుగా పట్టించుకోకుండా ఎన్నికల సమయంలో ఓట్ల కోసం టెండర్లు పిలిచిందనే అపవాదును మూటగట్టుకుంది. ప్రస్తుత ప్రభుత్వం తొలి యేడాదిలోనే ఈ పనులకు టెండర్లు పిలవడంతో ఈ నాలుగేళ్లలో పనులు పూర్తవుతాయనే ఆశ ఈ ప్రాంత ప్రజల్లో చిగురించింది

Related Posts