YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆరోగ్యం తెలంగాణ

గ్రానైట్ పై కరోనా పడగ

గ్రానైట్ పై కరోనా పడగ

గ్రానైట్ పై కరోనా పడగ
కరీంనగర్, మార్చి 3
కరోనా ఎఫెక్ట్ యావత్ ప్రపంచంతో పాటు కరీంనగర్‌పై పడింది. కరోనా దెబ్బకు ఆర్థికవ్యవస్థ అతలాకుతలమవుతోంది. కరీంనగర్‌కు రావాల్సిన 120 కోట్ల లావాదేవీలు కరోనా ప్రభావంతో నిలిచిపోయాయి. ప్రతి నెలా చైనాకు రూ.100 కోట్ల విలువైన గ్రానైట్ బ్లాక్‌లను కరీంనగర్ నుంచే ఎగుమతి చేసే వ్యాపారులు ఈ వైరస్ ప్రభావంతో వ్యాపారం ఆగిందని ఆందోళన పడుతున్నారు. రాష్ట్రంలో అన్ని రంగాలకు విస్తరించిన కరోనా వైరస్ ప్రభావంతో వ్యాపార రంగం ఆర్థిక ఇబ్బందులలో కూరుకుపోగా, ఈ ఎఫెక్ట్ ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా గ్రానైట్ పరిశ్రమపై పడింది. ఉమ్మడి కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని చొప్పదండి, కరీంనగర్, పెద్దపల్లి, మానకొండూర్, హుస్నాబాద్, హుజూరాబాద్, జగిత్యాల, కోరుట్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని గ్రానైట్ వ్యాపారం పెద్ద ఎత్తున కొనసాగుతోంది. గ్రానైట్ వ్యాపారంపై ఆధారపడిన యాజమాన్యాలు ఆగిన ఎగుమతులతో దిగులు చెందుతున్నారు. గ్రానైట్ రాయిని బ్లాక్‌లుగా కట్ చేసి ఇక్కడి నుండి చైనాకు తరలిస్తారు. అన్ని పరీక్షలు నిర్వహిస్తూ తమ అవసరాల మేరకు బ్లాక్‌లను తీసుకెళ్లేవారు. కరోనా దెబ్బతో గ్రానైట్ వ్యాపారం నిలిచిపోవడంతో దీనిపై ఆధారపడ్డ అనేకమంది కార్మికులు ఉపాధి కోల్పోగా గ్రానైట్ వ్యాపారం కుదేలుకావడంతో అతలాకుతలమవుతున్నట్టు వ్యాపారులు వెల్లడిస్తున్నారు. భారత మార్కెట్‌లో వంద కోట్ల వరకు ఇక్కడ వ్యాపారం సాగుతుండగా, కరోనా ఎఫెక్ట్‌తో చైనా, భారత్‌కు రాకపోకలు నిలిచిపోయి ఈ ప్రభావం గ్రానైట్ పరిశ్రమపై పడింది. కరీంనగర్ గ్రానైట్ వ్యాపారం కరోనా దెబ్బ నుంచి ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదని పలువురు వ్యాపారులు వాపోతున్నారు. యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా కరీంనగర్ వ్యాపారులను కన్నీళ్లు పెట్టిస్టోంది. ఇదివరకే కరోనా దెబ్బ పౌల్ట్రీరంగంపై పడి చికెన్ కొని తినడానికే భయపడే పరిస్థితి నెలకొనగా, కోడితో పాటు గుడ్డు కూడా కొనుగోళ్లు నిలిచిపోవడంతో పౌల్ట్రీ వ్యాపారులు ఆర్థికంగా చితికిపోయి అతలాకుతలమవుతున్నారు. ఇదే ప్రభావం ప్రస్తుతం కరీంనగర్ గ్రానైట్ రంగంపై పడడంతో ప్రతి నెలా చైనా నుండి రాష్ట్రానికి వంద కోట్ల ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోవడంతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది. గ్రానైట్ వ్యాపారం పూర్తిగా నిలిచిపోవడంతో ఆ పరిశ్రమపై ఆధారపడిన వ్యాపారులతో పాటు కూలీలు ఆందోళన చెందుతున్నారు.  చైనానుండి రావాల్సిన దాదాపు 120 కోట్ల చెల్లింపులు ఆగిపోవడంతో కూలీలకు ప్రస్తుతం వ్యాపారులు చెల్లించాల్సిన డబ్బులు కరోనా బూచి చూపి చెల్లించడం లేదని తెలుస్తోంది. దీంతో ఇనాళ్లు ఇదే పరిశ్రమ ఆధారపడి జీవనం కొనసాగించిన కుటుంబాలు మరో ఉపాధికోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా ఇదివరకే కరోనా దెబ్బతో ఆర్థికంగా చితికిపోయిన గ్రానైట్ వ్యాపారులు పూర్తిస్థాయిలో డబ్బులు చెల్లిస్తే మళ్లీ గ్రానైట్ వ్యాపారం ఆరంభమైనపుడు కూలీలు ఇతర వృత్తుల వైపు వెళ్లిపోతే కూలీలను వెతుక్కోవడం కష్టమవుతుందనే భావనతోనే వారికి చెల్లించాల్సిన డబ్బులను పూర్తి స్థాయిలో చెల్లించకుండా ఎంతో కొంత ముట్టచెబుతున్నట్టు సమాచారం. ఏదేమైనా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం కరీంనగర్ వ్యాపార రంగంపై పడి కోట్లాది రూపాయల వ్యాపారం ఎగుమతులు, దిగుమతులు ఆగిపోవడం వ్యాపారులతో పాటు కూలీలను కూడా కన్నీళ్లు పెడుతున్నారు

Related Posts