YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం ఆరోగ్యం తెలంగాణ

 తెలంగాణలో అడ్డూ అదుపు లేకుండా సిజేరియన్లు

 తెలంగాణలో అడ్డూ అదుపు లేకుండా సిజేరియన్లు

 తెలంగాణలో అడ్డూ అదుపు లేకుండా సిజేరియన్లు
హైద్రాబాద్, మార్చి 3,
రాష్ట్రంలో కడుపు కోతలు ఎక్కువైపోతున్నాయి. సిజేరియన్లలో టాపర్ను చేస్తున్నాయి. అవును, దేశంలో సిజేరియన్లు ఎక్కువ జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ టాప్లో నిలిచింది.  పోయినేడాది ‘టాప్ ర్యాంక్’ను నిలబెట్టుకుని అప్రతిష్ట మూటగట్టుకుంది. హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(హెచ్ఎంఐఎస్) విడుదల చేసిన రిపోర్ట్లో ఈ విషయం వెల్లడైంది. 2019–2020వ సంవత్సరంలో 50.2 శాతం డెలివరీలు సిజేరియన్ల ద్వారానే జరిగినట్టు రిపోర్ట్ పేర్కొంది. సర్కారు దవాఖాన్లలోనూ ఆ ట్రెండ్ ఎక్కువైంది. ఆ ఏడాది 2,48,354 డెలివరీలు ప్రభుత్వాస్పత్రుల్లో జరిగితే, అందులో 43.9 శాతం డెలివరీలు సిజేరియన్లే. ప్రైవేటు హాస్పిటళ్లలో అయితే సిజేరియన్ల వాటా 57.3 శాతం. గత రెండు నెలల్లో ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగిన డెలివరీల్లో మూడో వంతు సిజేరియన్లే. రాష్ర్టంలోని ఐదు జిల్లాల్లో సిజేరియన్లు 70 శాతంపైనే జరుగుతున్నాయి. ఈ జాబితాలో 76.5 శాతం సిజేరియన్లతో సూర్యాపేట టాప్లో నిలిచింది. ఆ తర్వాత భువనగిరి 76.3%, వరంగల్ అర్బన్ 70.5, నిర్మల్ 73.4, కరీంనగర్లో 70 శాతం సిజేరియన్లు జరిగాయి. కరీంనగర్  జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటళ్లలో 80 శాతం వరకు కోతలే ఉంటున్నాయి. మొత్తంగా 16 జిల్లాల్లో రాష్ర్ట సగటు 50.2% కన్నా ఎక్కువ సిజేరియన్లు జరుగుతున్నట్టు హెచ్ఎంఐఎస్ రిపోర్ట్  పేర్కొంది.కేసీఆర్ కిట్ ప్రారంభించిన తర్వాత సర్కార్ దవాఖాన్లలో డెలివరీలు పెంచాలన్న లక్ష్యంతో ఎడాపెడా సిజేరియన్లు చేశారు. దీంతో గవర్నమెంట్ హాస్పిటళ్లలో సిజేరియన్లు 75 శాతం  దాటిపోయాయి. అయితే, వాటిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సెంట్రల్ హెల్త్ ఆఫీసర్లు ఆదేశించారు. దీంతో పోయినేడాది నుంచి రాష్ట్రంలో నార్మల్ డెలివరీలను ప్రోత్సహించేందుకు  అధికారులు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. అయినా, నార్మల్ డెలివరీపై ఉన్న భయాలు, అపోహలతో చాలా మంది సిజేరియన్లకే మొగ్గు చూపుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం  రాష్ట్రంలో జరుగుతున్న డెలివరీల్లో సగానికిపైగా ప్రభుత్వాస్పత్రుల్లోనే జరుగుతున్నా, అందుకు తగ్గట్టు గైనకాలజిస్టుల సంఖ్య మాత్రం లేదు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని జిల్లా,  ఏరియా దవాఖానలు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లలో వందకుపైగా గైనిక్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ కొరతను తగ్గించేందుకు కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలు చేస్తున్నా గైనకాలజిస్టులు  ఆసక్తి చూపించట్లేదు. సర్కారు దవాఖాన్లలో జీతాలు తక్కువగా ఉండడం, పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్లే గైనిక్లు రావడంలేదని డాక్టర్లు చెబుతున్నారు. ప్రైవేట్లో డిమాండ్  ఎక్కువుండడంతో అటువైపే వెళ్తున్నారని అంటున్నారు.

Related Posts