YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

స్థానిక ఎన్నికల రిజర్వేషన్లల్లో మార్పులపై ఏపీ సర్కార్ కసరత్తు

స్థానిక ఎన్నికల రిజర్వేషన్లల్లో మార్పులపై ఏపీ సర్కార్ కసరత్తు

స్థానిక ఎన్నికల రిజర్వేషన్లల్లో మార్పులపై ఏపీ సర్కార్ కసరత్తు
అమరావతి మార్చి 3
హైకోర్టు ఆదేశాలతో స్థానిక ఎన్నికల రిజర్వేషన్లల్లో చేయాల్సిన మార్పులు చేర్పులపై ఏపీ సర్కార్ కసరత్తు ప్రారంభించింది. 09.85 శాతం మేర రిజర్వేషన్లు తగ్గించేలా చర్యలు చేపట్టింది.  బీసీ రిజర్వేషన్లను తగ్గించే విషయమై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. గతంలో ఇచ్చిన జీవో మేరకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం ప్రకటించింది. హైకోర్టు ఆదేశాలతో బీసీ రిజర్వేషన్లల్లో 09.85 శాతం మేర కోత తగ్గే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లను 24.15 శాతానికి పరిమితం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బీసీలకు 24.15 శాతం, ఎస్సీ, ఎస్టీలకు యధాతథంగా 19.08, 6.77 శాతాల మేర ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లోనే రిజర్వేషన్లను ఖరారు చేసే ఛాన్స్ ఉంది. వారం రోజుల్లోగానే స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక సంస్థల రిజర్వేషన్లు 50 శాతం మించవద్దని హైకోర్టు తేల్చి చెప్పింది. 59.85 శాతం రిజర్వేషన్లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబరులో జారీ చేసిన జీవోను, అందుకు అనుగుణంగా చేపట్టిన తదుపరి చర్యలనూ రద్దు చేసింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తూ... ఏపీ పంచాయతీరాజ్‌ చట్టంలోని పలు సెక్షన్లనూ తప్పుబట్టింది. నెల రోజుల్లో తిరిగి బీసీల రిజర్వేషన్లు ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన  విషయం తెలిసిందే.

Related Posts