YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 పుర ఎన్నికలపై సీఎం జగన్ సమీక్ష

 పుర ఎన్నికలపై సీఎం జగన్ సమీక్ష

 పుర ఎన్నికలపై సీఎం జగన్ సమీక్ష
అమరావతి మార్చ్ 3
స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. నెలరోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిచేయాలని సీఎం ఆదేశాలిచ్చారు. హైకోర్టు కూడా ఇదే విషయం చెప్పిందన్న సీఎం  ఈ  నెలాఖరులోగా ఎంపీటీసీ, జెట్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు జరపాలన్నారు. సీఎం మాట్లాడుతూ  పంచాయతీరాజ్‌ చట్టంలో సవరణలకోసం ఆర్డినెన్స్‌ తీసుకువచ్చాం.  డబ్బులు,  లిక్కర్‌లను పూర్తిగా నిరోధించాలన్న దృక్పథంతో ఆర్డినెన్స్‌ తెచ్చాం.  పోలీస్‌యంత్రాంగం చాలా దృఢంగా పనిచేయాలి, దీన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకోవాలి డబ్బులు పంచుతూ, ఎన్నికల తర్వాత  కూడా నిర్ధారణ అయితే అనర్హత వేటు విధిస్తాం. మూడేళ్లపాటు జైలు శిక్ష పడుతుంది. జిల్లా ఎస్పీలు డబ్బులను, మద్యాన్ని అరికట్టాలిని అన్నారు. ప్రతి గ్రామంలో ఉన్న పోలీస్‌ మిత్రలను, గ్రామంలో మహిళా పోలీసును పూర్తిస్థాయిలో వినియోగించాలి.  ఎక్కడా డబ్బు,లిక్కర్ పంపిణీచేశారన్న మాట రాకూడదు.   ఎవరో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి వచ్చి కోట్లుకోట్లు వెదజల్లి ఎన్నికల్లో  గెలవడంకాదు, ఊరిలో ప్రజలందరికీ అందుబాటులో ఉండి వారికి సేవచేసే వ్యక్తులు ఎన్నిక కావాలని అయన అన్నారు. మన రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ దేశానికి ఆదర్శం కావాలి.సాధారణ ఎన్నికల ఎన్నికల అక్రమాలు, ఉల్లంఘనల నిరోధానికి యాప్‌ ఉపయోగించిన మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఒక యాప్‌ అందుబాటులో ఉంచాలి. ఎన్నికల  అధికారులకు, పోలీసు అధికారులకు ఈ డేటా చేరాలని అయన అన్నారు. 

Related Posts