YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బీసీల ద్రోహి చంద్రబాబు

బీసీల ద్రోహి చంద్రబాబు

బీసీల ద్రోహి చంద్రబాబు
టీడీపీ నేతల కుట్రల వల్లే బీసీలకు అన్యాయం గత ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టారనే ఆ వర్గాలపై కక్ష
స్థానిక ఎన్నికల్లో టీడీపీకి శాశ్వత సమాధి కట్టండి అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి 
అనంతపురం, మార్చ్ 3
బడుగు, బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ అన్యాయం చేస్తోందని, ఆ పార్టీ అధినేత చంద్రబాబు బీసీల ద్రోహి అని అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి అన్నారు.  మంగళవారం తన స్వగృహం వద్ద అర్బన్‌ నియోజకవర్గ పరిధిలోని 18 మందికి సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయంగా కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. కేబినెట్‌లో 60 శాతం మందికి అవకాశం కల్పించారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ,  మైనార్టీ వర్గాలకు చెందిన ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారన్నారు. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో సైతం 50 శాతం రిజర్వేషన్లు అందిస్తున్నట్లు చెప్పారు. వెనుకబడిన  తరగతులకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వడం కోసం స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయం సుకున్నారన్నారు. ఈ రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికల నిర్వహణకు హైకోర్టు అభ్యంతరం తెలుపలేదని, కానీ టీడీపీ నేత ప్రతాప్‌రెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్లడంతో స్టే ఇచ్చిందన్నారు. తాజాగా రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేయడంతో బీసీలు 9.85 శాతం పదవులకు దూరమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. చంద్రబాబు, టీడీపీ కుట్రల వల్లే బీసీలకు అన్యాయం జరిగిందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగని కారణంగా ఇప్పటికే కేంద్రం నుంచి రూ.3700 కోట్లకు పైగా నిధులు రాలేదన్నారు. బీసీల అభ్యున్నతికి అడుగడుగునా సైంధవుడిలా చంద్రబాబు అడ్డుపడుతున్నారని  మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైతే టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్పారో త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి శాశ్వత సమాధి కడతారని అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు  మేలు చేయడానికి ప్రభుత్వం ఏం చేస్తున్నా టీడీపీ అడ్డుపడుతోందని అన్నారు. ఇంగ్లిష్‌ మీడియం విషయంలోనూ కోర్టుకు వెళ్లిన విషయాన్ని గుర్తుకు చేశారు. జనసేన, బీజేపీ నాయకులు కూడా టీడీపీకి వంతపాడడం సరికాదన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓడించారన్న కక్షతోనే చంద్రబాబు బీసీల అభివృద్ధి విషయంలో అడ్డుతగులుతున్నారని ఆరోపించారు.  తొమ్మిది నెలల్లో  120 మందికి సీఎంఆర్‌ఎఫ్‌ అనంతపురం అర్బన్‌ నియోజకవర్గ పరిధిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లో 120 మందికి సీఎం రిలీఫ్‌ఫండ్‌ కింద ఆదుకున్నామని ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఓ వరమన్నారు. గతంలో పేదవాళ్ల కష్టాలు చూసి కార్పొరేట్‌ వైద్యం అందించేలా వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసుకొచ్చారన్నారు. ఆ తర్వాత పాలకులు దాన్ని పట్టించుకోలేదని అన్నారు. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీని  విస్తరించినట్లు చెప్పారు. సీజనల్‌ వ్యాధులను కూడా ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెస్తున్నట్లు చెప్పారు. తలసేమియా, కిడ్నీ బాధితులకు పింఛన్‌ అందజేస్తున్నామన్నారు. ఆరోగ్య శ్రీ వర్తించలేని  వాళ్లకు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఆదుకుంటున్నామన్నారు. బడుగు, బలహీన వర్గాలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

Related Posts