YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

దేశానికి డేంజర్ బెల్.. పెరుగుతున్న నిరుద్యోగం.. 

దేశానికి డేంజర్ బెల్.. పెరుగుతున్న నిరుద్యోగం.. 

దేశానికి డేంజర్ బెల్.. పెరుగుతున్న నిరుద్యోగం.. 
న్యూ డిల్లీ, మార్చ్ 3
అసలే దేశం ఆర్థిక మాంద్యం లో కొట్టుమిట్టాడుతోంది. 4 శాతానికి కిందకు జీడీపీ పడిపోయింది. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను కరోనా చావు దెబ్బ తీసింది. ఆర్థిక మాంద్యం ఒకవైపు కరోనా ఎఫెక్ట్ మరోవైపు మోహరించడం తో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. తాజా సర్వేలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. దేశంలో ఫిబ్రవరి నెలలో సగటు నిరుద్యోగ రేటు సుమారు 7.78శాతంగా నమోదైంది. జనవరి నెలలో ఇది 7.16శాతంగా ఉంది. ఒక్క నెలలోనే 70-100 బేస్ పాయింట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో 7.37శాతంగా.. పట్టణ ప్రాంతాల్లో 8.65శాతం నిరుద్యోగం నమోదైంది. అక్టోబర్ 2019 తర్వాత ఇదే అత్యధికం కావడం గమనార్హం.కరోనా వైరస్ చైనా దాటి పారిశ్రామిక దేశాలైన దక్షిణ కొరియా జపాన్ హాంగ్ కాంగ్ ఇటలీ సింగపూర్ అమెరికా దేశాలకు పాకింది. భారత్ కు చేరి హైదరాబాద్ లోనూ కేసు నమోదైంది. దీంతో ప్రపంచానికి కర్మాగారాలైన ఉత్పత్తి దేశాలైన వాటి నుంచి ఎగుమతులు ఆయా దేశాలకు నిలిచి పోయాయి. ఈ ప్రభావం అన్ని రంగాలపై దేశ ఆర్థిక రంగం పై పడుతోంది.కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో అనేక దేశాల నుంచి మన దేశానికి రావాల్సిన దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో ఎక్స్ పోర్టు ఇంపోర్టు వ్యాపారాల్లో ఉన్న వారు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఆయా కంపెనీల్లోని ఉద్యోగులను తొలగిస్తున్నారు. పోర్టులు ఎయిర్ పోర్టులు తీవ్ర నష్టాల్లో ఉన్నాయి. వాటి అనుబంధ రంగాలు దెబ్బ తింటున్నాయి. తద్వారా దేశంలో నిరుద్యోగ రేటు ఎన్నడూ లేనంతగా పెరిగి పోయింది.

Related Posts